ప్రస్తుత ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అదరగొడుతున్నాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య. ఆ జట్టు ఫ్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ చేజారుతుందన్న సమయంలో బ్యాట్‌తో చెలరేగిపోతున్నాడు హార్దిక్. ఇదే ప్రదర్శనను వరల్డ్‌కప్‌లోనూ కొనసాగించాలని పాండ్యాకు సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సూచించాడు. ఈ విషయాన్ని అతడికి చెప్పినట్లు యువీ పేర్కొన్నాడు.
‘నీ ముందు గొప్ప అవకాశం ఉంది. అటు బ్యాట్‌తోనూ ఇటు బంతితోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండు. నీ మెరుపులు.. వరల్డ్‌కప్‌లోనూ చూడాలి. ప్రస్తుతం ఎంత ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నావో అదే ఊపును మెగా టోర్నీలో కూడా కొనసాగించు’ -యువరాజ్ సింగ్, క్రికెటర్
కోల్‌కతాతో మ్యాచ్‌లో హార్దిక్ చేసిన 91 పరుగులు.. తాను ఐపీఎల్‌లో చూసిన వాటిలో అత్యుత్తమ ఇన్నింగ్స్ అంటూ యూవీ ప్రశంసించాడు.
ఒత్తిడిలోనూ బౌలింగ్ ఎలా చేయాలో హార్దిక్ తెలుసుకున్నాడని, ఇది అతడికి వరల్డ్‌కప్‌లో కలిసి వస్తుందని యువరాజ్ చెప్పాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలుచుకోవడంలో యువరాజ్ ప్రధాన భూమిక పోషించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.