ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో విజేతగా నిలిచింది ముంబయి ఇండియన్స్. గట్టి పోటీ ఇచ్చింది కానీ గెలవలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్. కేవలం ఒక్క పరుగు తేడాతో నాలుగో ఐపీఎల్ టైటిల్ చేజార్చుకుంది. అయితే సీఎస్కే జట్టులోని ఇమ్రాన్ తాహిర్ ఈ టోర్నీలో పలు అరుదైన రికార్డులు సాధించాడు.
ఈ సీజన్లో అత్యధికంగా 26 వికెట్లు తీసిన తాహిర్.. ఎక్కువ వయసులో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్లో ఏ సీజన్ తీసుకున్నా ఓ స్పిన్నర్ ఇన్ని వికెట్లు తీయలేదు. 2012లో 24 వికెట్లు తీసిన నరైన్ ఈ జాబితాలో తర్వాతి స్థానంలో ఉన్నాడు. 40 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఫైనల్ ఆడిన తొలి క్రికెటర్‌గానూ నిలిచాడు ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు.
ప్రస్తుతం ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్న తాహిర్.. ఈ మెగాటోర్నీ తర్వాత వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నాడు.
ఇది చదవండి: నరాలు తెగే ఉత్కంఠలో.. నాలుగో టైటిల్ నెగ్గిన ముంబయి