మరో మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయమవుతుందనగా చెన్నై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. వరుసగా సన్‌రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్‌పై ఓటమిపాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై గెలుపు ముంగిట చతికిలపడింది. ధోని అద్భుత ఇన్నింగ్స్ వృథా అయింది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది ధోనీసేన.
చెన్నై ప్రధాన బలహీనత టాప్ ఆర్డర్ విఫలమవడం. టోర్నీలో ఇప్పటివరకు వాట్సన్ (147), రాయుడు (192), రైనా (201) పరుగులు మాత్రమే చేశారు. మిడిలార్డర్లో ధోని మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఈ సీజన్లో 314 పరుగులు చేసి చెన్నై తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు మహీ. సొంత మైదానంలో ఆడుతుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో దీపక్ చాహర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. జడేజా, తాహిర్, బ్రావో కూడా ఫర్వాలేదనిపిస్తున్నారు.
సన్‌రైజర్స్ జట్టు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలిచి జోరుమీదుంది. ఈ జట్టు ప్రధాన సమస్య మిడిలార్డల్ విఫలమవడం. వార్నర్ 517 పరుగులతో ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్‌తో కొనసాగుతున్నాడు. మరో ఓపెనర్ బెయిర్ స్టో 445 పరుగులతో టాప్ ఫామ్‌లో ఉన్నాడు. వీరిద్దరూ మినహాయిస్తే మిగతా బ్యాట్స్‌మెన్ ఆకట్టుకోలేకపోతున్నారు. విలియమ్సన్, దీపక్ హుడా, యూసఫ్ పఠాన్ రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో భువనేశ్వర్, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు.
జట్ల అంచనా
సన్‌రైజర్స్ హైదరాబాద్
విలియమ్సన్ (కెప్టెన్), వార్నర్, బెయిర్ స్టో, విజయ్ శంకర్, దీపక్ హుడా, యూసఫ్ పఠాన్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీం, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్
చెన్నై సూపర్ కింగ్స్
ధోని (కెప్టెన్), వాట్సన్, డుప్లెసిస్, రైనా, రాయుడు, కేదార్ జాదవ్, బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, షార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్