ETV Bharat / sports

'ఆ ముగ్గురి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా' - రోహిత్ శర్మ

ప్రస్తుత ఐపీఎల్​లో ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని దిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. క్వాలిఫయర్-2లో ఓడిన దిల్లీ.. మూడో స్థానంతో సీజన్​ను ముగించింది.

'ఆ ముగ్గురి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా'
author img

By

Published : May 11, 2019, 1:00 PM IST

ఐపీఎల్​లో గత కొన్నేళ్లుగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయింది దిల్లీ క్యాపిటల్స్. కానీ ఈ సీజన్​లో సమష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. శుక్రవారం చెన్నైతో జరిగిన క్వాలిఫయర్-2లో ఓడి మూడో స్థానంలో నిలిచింది. ఫైనల్​ చేరకపోయినా క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకుంది. యువ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్.. దిల్లీ జట్టును నడిపించిన తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన ఈ క్రికెటర్.. తనకు అండగా నిలిచిన యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలిపాడు.

"దిల్లీ క్యాపిటల్స్​కు కెప్టెన్​గా వ్యవహరించినందుకు గర్విస్తున్నా. మాపై ఒత్తిడి ఉందన్న మాట నిజం. చెన్నైతో మ్యాచ్​లో అనుకున్నన్ని పరుగులు చేయలేకపోయాం. వపర్‌ప్లేలో ఆ జట్టు స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాం. మ్యాచ్​ ఓడినప్పటికీ మా ప్రదర్శన పట్ల పూర్తి సంతోషంగా ఉన్నా. రానున్న సీజన్‌లో మరింత మెరుగ్గా రాణిస్తాం" -శ్రేయస్ అయ్యర్, దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్

ఈ సీజన్‌లో ధోని, కోహ్లీ, రోహిత్‌ శర్మ వంటి మేటి కెప్టెన్ల పక్కన నిలబడటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు శ్రేయస్ అయ్యర్. సారథిగా వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పాడీ ఈ యువ కెప్టెన్‌.

Coimbatore (TN), May 11 (ANI): Dravida Munnetra Kazhagam (DMK) chief MK Stalin visited home of former party MP M Ramanathan in Tamil Nadu's Coimbatore to pay his last respect. M Ramanathan passed away on May 10 at his residence after battling with age-related ailments for a few years. He was 84. Ramanathan has become MLA twice and had also served MP from Coimbatore.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.