ETV Bharat / sports

ధోనీ రనౌటే మ్యాచ్​ను మలుపు తిప్పింది : సచిన్​ - మ్యాచ్

ఫైనల్​లో ధోనీ రనౌటే మ్యాచ్​ను మలుపు తిప్పిందని క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందుల్కర్​ అభిప్రాయపడ్డారు. కీలక సమయాల్లో రోహిత్ మంచి నిర్ణయాలు తీసుకున్నాడని కితాబిచ్చాడు ముంబయి ఇండియన్స్​ కోచ్​ మహేల జయవర్ధనే.

సచిన్
author img

By

Published : May 13, 2019, 2:27 AM IST

Updated : May 13, 2019, 7:46 AM IST

చెన్నై - ముంబయి మధ్య జరిగిన ఐపీఎల్​ ఫైనల్​పై క్రికెట్​ దిగ్గజం సచిన్, ముంబయి కోచ్​ జయవర్ధనే తమ అభిప్రాయలను తెలిపారు. ధోనీ రనౌటే మ్యాచ్​ను​ మలుపు తిప్పిందని క్రికెట్ దిగ్గజం, ముంబయి ఇండియన్స్​ మెంటార్​ సచిన్ తెందూల్కర్​ అభిప్రాయపడ్డారు. చివరి​ ఓవర్లలో అనుభవజ్ఞులకు బౌలింగ్​ ఇచ్చి రోహిత్ మంచి నిర్ణయాలు తీసుకున్నాడని ముంబయి కోచ్​ జయవర్ధనే అన్నాడు.

"ధోనీ రనౌటే మ్యాచ్​ను మలుపు తిప్పింది. మలింగ 16 ఓవర్లో ధారాళంగా పరుగులిచ్చినా.. చివర్లో అద్భుతంగా వేశాడు. బుమ్రా చక్కటి ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండేళ్ల క్రితం 129 పరుగులను కాపాడుకోగలిగాం.. అందుకే విజయంపై ముందు నుంచి ఆత్మవిశ్వాసంతోనే ఉన్నాం" -సచిన్ తెందూల్కర్​, ముంబయి మెంటార్

"ధోనీని మేం త్వరగానే పెవిలియన్​కు పంపగలిగాం. కానీ వాట్సన్​ తన హిట్టింగ్​తో మ్యాచ్​ను దూరం చేసే ప్రయత్నం చేశాడు. అలాంటి సమయంలో రోహిత్​ డెత్ ఓవర్లలో అనుభవజ్ఞులకు బౌలింగ్ ఇచ్చి మంచి నిర్ణయాలు తీసుకున్నాడు" - మహేల జయవర్ధనే, ముంబయి కోచ్​

ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్​ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో చెన్నైపై గెలిచింది. ఈ విజయంతో రోహిత్​సేన నాలుగోసారి ఐపీఎల్​ టైటిల్​ నెగ్గింది. బుమ్రా రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Etihad Stadium, Machester, England, UK. 12th may 2019.
1. 00:00 Various of Man City fans watching match, applauding goals and celebrating the title  
SOURCE: SNTV
DURATION: 00:48
STORYLINE:
Manchester City fans witnessed their club win the English Premier League title on the final day of the season, with thousands of fans watching the crucial 4-1 win away over Brighton on a big screen outside the Etihad Stadium.
Last Updated : May 13, 2019, 7:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.