కోల్‌కతా నైట్ రైడర్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. జయపుర వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. 140 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు క్రిస్‌లిన్ (50, 32 బంతుల్లో) అర్ధ శతకంతో అదరగొట్టగా, సునీల్ నరైన్(47, 25బంతుల్లో) రాణించాడు. రాజస్థాన్ బౌలర్లలో శ్రేయస్ ఒక్కడే 2 వికెట్ల తీయగా మిగతా వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేదు. కోల్‌కతా బౌలర్ గుర్నేకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' లభించింది.
-
Slow-paced wicket❓ 😅
— KolkataKnightRiders (@KKRiders) April 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A ⚡ run-chase by our Knights to move to the 🔝 of the table 💜#RRvKKR #VIVOIPL #KKRHaiTaiyaar pic.twitter.com/I3ioBgFGzj
">Slow-paced wicket❓ 😅
— KolkataKnightRiders (@KKRiders) April 7, 2019
A ⚡ run-chase by our Knights to move to the 🔝 of the table 💜#RRvKKR #VIVOIPL #KKRHaiTaiyaar pic.twitter.com/I3ioBgFGzjSlow-paced wicket❓ 😅
— KolkataKnightRiders (@KKRiders) April 7, 2019
A ⚡ run-chase by our Knights to move to the 🔝 of the table 💜#RRvKKR #VIVOIPL #KKRHaiTaiyaar pic.twitter.com/I3ioBgFGzj
- రాజస్థాన్ నిదానం..
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా జట్టు.. రాజస్ధాన్ని 139 పరుగులకే పరిమితం చేసింది. గుర్నే రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. ప్రసిధ్ కృష్ణ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కోల్‌కతా బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తూ పరుగుల వేగాన్ని తగ్గించారు. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్( 73, 59 బంతుల్లో) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. సొంత మైదానంలో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ బ్యాట్ ఝళిపించలేకపోయారు.
- ఓపెనింగ్ అదిరింది...
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు మంచి ఆరంభం దక్కింది. తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించి జట్టు విజయాన్ని ఎప్పుడో ఖాయం చేశారు ఓపెనర్లు. క్రిస్ లిన్, సునీల్ నరైన్ ధాటిగా ఆడి లక్ష్య ఛేదనలో కీలకపాత్ర పోషించారు. తర్వాత వీరిద్దరూ ఔటైనప్పటికీ మిగతా పని సులువు చేశాడు రాబిన్ ఉతప్ప (26).
ఈ మ్యాచ్‌లో ముఖ్యమైన విశేషాలు
- నాలుగో ఓవర్ మొదటి బంతికే ధవళ్ కులకర్ణి బౌలింగ్‌లో నరైన్ క్యాచ్‌ని జారవిడిచాడు రాజస్ధాన్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి.
- ఇదే ఓవర్లో రెండో బంతికే క్రిస్‌లిన్ బౌల్డ్ అయ్యాడు. బెయిల్స్ కింద పడకపోవడంతో అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇలా రెండు సార్లు కోల్‌కతాకు అదృష్టం కలిసొచ్చింది.
- ఇది కోల్‌కతాకు నాలుగో విజయం కాగా, రాజస్థాన్‌కు నాలుగో పరాజయం.