సొంతగడ్డపై ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 40 పరుగుల తేడాతో పరాజయం చెందింది. 137 పరుగుల లక్ష్య ఛేదనలో 96 పరుగులకే కుప్పకూలింది. ముంబయి బౌలర్ అల్జారీ జోసెఫ్ 6 వికెట్ల తీసి హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. 33 పరుగులకే సన్‌రైజర్స్ ఓపెనర్లు ఔట్ కాగా మిగతా బ్యాట్స్‌మెన్ వరసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అల్జారీ జోసెఫ్ ఎంపికయ్యాడు.
-
136 to defend...Who will you call?
— Mumbai Indians (@mipaltan) April 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #SRHvMI pic.twitter.com/fl8lXoT4vm
">136 to defend...Who will you call?
— Mumbai Indians (@mipaltan) April 6, 2019
#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #SRHvMI pic.twitter.com/fl8lXoT4vm136 to defend...Who will you call?
— Mumbai Indians (@mipaltan) April 6, 2019
#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #SRHvMI pic.twitter.com/fl8lXoT4vm
- మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 136 పరుగులు చేసింది. మొదట బ్యాట్స్‌మెన్ తడబడ్డా.. చివర్లో పోలార్డ్ 26 బంతుల్లో 46 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఈ పరుగులే ముంబయి గెలుపులో కీలకపాత్ర పోషించాయి.
అదరగొట్టిన అల్జారీ జోసెఫ్...
లక్ష్యచేధనలో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. మంచి ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టోను(16) ముంబయి బౌలర్ రాహుల్ ఔట్ చేశాడు. అనంతరం తన తొలి బంతికే వార్నర్‌ని(15) బౌల్డ్ చేశాడు అల్జారీ జోసెఫ్. తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్ వేగంగా పరుగుల రాబట్టుకోవడంలో ఇబ్బంది పడ్డారు. విజయశంకర్(5), హుడా(20), రషీద్ ఖాన్(0), భువనేశ్వర్ కుమార్(2), సిద్ధార్ధ కౌల్(0)పెవిలియన్ పంపాడు అల్జారీ. మొత్తం ఆరు వికెట్ల తన ఖాతాలో వేసుకున్నాడు జోసెఫ్.
-
Alzarri Joseph now has the best figures on @IPL debut - 6/12 🌟🌟🌟🌟🌟🌟#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #SRHvMI pic.twitter.com/BY8yMQdDh3
— Mumbai Indians (@mipaltan) April 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Alzarri Joseph now has the best figures on @IPL debut - 6/12 🌟🌟🌟🌟🌟🌟#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #SRHvMI pic.twitter.com/BY8yMQdDh3
— Mumbai Indians (@mipaltan) April 6, 2019Alzarri Joseph now has the best figures on @IPL debut - 6/12 🌟🌟🌟🌟🌟🌟#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #SRHvMI pic.twitter.com/BY8yMQdDh3
— Mumbai Indians (@mipaltan) April 6, 2019
- ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆరు వికెట్ల తీసి రికార్డు సృష్టించాడు అల్జారీ. ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకు ఏ బౌలర్‌కు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడీ కరేబియన్ బౌలర్.
- 3.4 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులే ఇచ్చాడు జోసెఫ్. అందులో ఓ మేడిన్ ఉంది.
సన్‌రైజర్స్ బౌలర్లలో కౌల్ రెండు వికెట్లు తీయగా... సందీప్, భువి, నబీ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో పేలవ ఫీల్డింగ్‌తో ముంబయికి అదనపు పరుగులు సమర్పించుకుంది సన్‌రైజర్స్ జట్టు.