ETV Bharat / sports

'వెళ్లిన ప్రతిచోట బుడగలో ఉండటం పెద్ద సవాల్​' - sunrisers hyderabad

ఒక బయోబబుల్​ వాతావరణంలో​ నుంచి మరొక బుడగలోకి అడుగుపెట్టడం పెద్ద సవాల్​ లాంటిదని అభిప్రాయపడ్డాడు సన్​రైజర్స్​ హైదరాబాద్​ కెప్టెన్ డేవిడ్ వార్నర్. కుటుంబసభ్యులు తన పక్కన లేకపోవడం చాలా బాధగా ఉందని చెప్పాడు. ఈ ఐపీఎల్​లో తమ జట్టు​ రాణించగలదని ధీమా వ్యక్తం చేశాడు.

David Warner
వార్నర్​
author img

By

Published : Sep 21, 2020, 9:51 AM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

బయోబబుల్​ వాతావరణంలో ఇంగ్లాండ్​-ఆస్ట్రేలియా ఆటగాళ్లు ద్వైపాక్షిక సిరీస్​ ఆడి ఐపీఎల్​ కోసం ఇటీవల దుబాయ్​ చేరుకున్నారు. అక్కడ కూడా 36 గంటలపాటు క్వారంటైన్​లో ఉండి బయోబుడగలోకి అడుగుపెట్టారు. అయితే మ్యాచ్ కోసం వెళ్లిన ప్రతిచోట ఈ బుడగలోకి అడుగుపెట్టడం ఓ పెద్ద సవాల్​ లాంటిదని అభిప్రాయపడ్డాడు సన్​రైజర్స్​ హైదరాబాద్​ సారథి డేవిడ్​ వార్నర్​. ముఖ్యంగా కుటుంబ సభ్యులు తనతో లేకపోవడం చాలా భారంగా అనిపిస్తోందని చెప్పాడు.

"బయో బబుల్​ వాతావరణం ఓ పెద్ద సవాల్​ లాంటిది. రాబోయే కొన్ని నెలలపాటు ఇలానే కొనసాగుతుంది. కుటుంబసభ్యులతో కలిసి గడపలేకపోవడం చాలా బాధాకరం. కరోనా కారణంగా ఇది తప్పదు. ఏదేమైనప్పటికీ బీసీసీఐ, ఫ్రాంచైజీ నిర్వాహకులు మంచి నిర్ణయమే తీసుకున్నారు."

-వార్నర్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​ సారథి.

గతసీజన్​లో తమ జట్టు మిడిల్​ ఆర్డర్​లో విఫలమైందని గుర్తుచేసుకున్నాడు వార్నర్​. ఈ సారి ఆ లోటును భర్తీ చేశామని తెలిపాడు. బౌలర్స్​ భువనేశ్వర్​ కుమార్​, రషీద్​ ఖాన్ సహా తమ జట్టులోని ఆటగాళ్లందరూ​ ఈ సీజన్​లో బాగా రాణిస్తారని అభిప్రాయపడ్డాడు. దుబాయ్​ వాతావరణానికి తాము బాగానే అలవాటుపడ్డామని చెప్పుకొచ్చాడు. నేడు రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరుతో అమీతుమీ తేల్చుకోనుంది సన్​రైజర్స్​ హైదరాబాద్​.

ఇదీ చూడండి రాయుడు, చావ్లాపై మంజ్రేకర్​ వివాదాస్పద వ్యాఖ్యలు

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.