ETV Bharat / sports

ప్లే ఆఫ్​ చేరాలంటే తప్పక గెలవాల్సిందే..! - పంజాబ్

ప్లే ఆఫ్​లో స్థానం కోసం కీలక మ్యాచ్​ ఆడనున్నాయి కోల్​కతా - పంజాబ్ జట్లు. మొహాలి వేదికగా నేడు మ్యాచ్​ జరగనుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 5 మ్యాచ్​లలో గెలిచి ప్లే ఆఫ్​పై​ దృష్టి పెట్టాయి. పంజాబ్​తో పోల్చుకుంటే కోల్​కతా రన్​రేట్ కాస్త మెరుగ్గా ఉంది.

కోల్​కతా- పంజాబ్
author img

By

Published : May 3, 2019, 6:00 AM IST

Updated : May 3, 2019, 7:36 AM IST

ఈ సీజన్​ ఐపీఎల్​లో ఆడిన 12 మ్యాచ్​ల్లో చెరో ఐదింటిలో గెలిచి ప్లే ఆఫ్​లో స్థానం కోసం పోటీ పడుతున్నాయి కోల్​కతా నైట్​ రైడర్స్​ - కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్ జట్లు. నేడు ఈ రెండింటి మధ్య మొహాలి వేదికగా మ్యాచ్​ జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్​. ఈ మ్యాచ్​లో ఓడిన జట్టు ప్లే ఆఫ్​కు దాదాపు దూరమైనట్టే.

ఈ మ్యాచ్​లో నెగ్గి చివరి మ్యాచ్​లో ఓడినా... ఇందులో ఓడి తర్వాతి దాంట్లో నెగ్గినా ఇరు జట్ల నెట్​ రన్​రేట్ ఆధారంగా ఎక్కువ రన్​రేట్​ ఉన్న జట్టు ప్లే ఆఫ్​కు వెళ్లే అవకాశముంది. టాప్​-4 స్థానం కోసం 3 జట్లు (కోల్​కతా, పంజాబ్, హైదరాబాద్​) పోటీ పడుతున్నాయి. రాజస్థాన్​ రాయల్స్​, బెంగళూరు కూడా నామమాత్రంగా ఇంకా రేసులోనే ఉన్నాయి.

ఈ సీజన్​ ప్రారంభంలో వరుసగా మ్యాచ్​లు గెలిచిన కోల్​కతా తర్వాత వెనుకబడింది. ఒకరిద్దరిపైనే ఎక్కువగా ఆధారపడుతూ.. సమష్టిగా రాణించడంలో విఫలమౌతుంది రైడర్స్​ జట్టు. గత మ్యాచ్​లో ముంబయిపై శుభమన్ గిల్(75), క్రిస్​ లిన్(54), రసెల్​(80) చెలరేగి జట్టుకు విజయాన్ని అందించారు. 12 మ్యాచ్​లలో 486 పరుగులు చేసిన రసెల్ భీకరమైన ఫామ్​లో ఉన్నాడు. మరోసారి అతడు బ్యాట్​ ఝుళిపించాలని కోల్​కతా అభిమానులు ఆశిస్తున్నారు. బ్యాటింగ్​లో బలంగా కనిపిస్తున్నా.. బౌలింగ్​లో కాస్త బలహీనంగా ఉంది కోల్​కతా. నరైన్, పియూష్ చావ్లా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. పంజాబ్​తో పోల్చుకుంటే రన్​రేట్​లో కొంచెం మెరుగ్గా ఉంది నైట్​రైడర్స్​.

బ్యాటింగ్​లో రాహుల్​, గేల్​పైనే ఎక్కువ ఆధారపడుతోంది పంజాబ్​. 12 మ్యాచ్​లలో రాహుల్​ 520 పరుగులు చేయగా.. గేల్ 448 రన్స్​తో రాణించాడు. మిడిల్​ ఆర్డర్​లో మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ ఆకట్టుకోవాల్సి ఉంది. బౌలింగ్​లో అశ్విన్, షమి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఈ మ్యాచ్​లో ఓడితే పంజాబ్​ ప్లే ఆఫ్​కు దూరమయ్యే అవకాశముంది. సొంతగడ్డపై మ్యాచ్​ జరగనుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

జట్లు... (అంచనా)

కోల్​కతా నైట్​ రైడర్స్​..

దినేశ్​ కార్తీక్(కెప్టెన్, కీపర్), శుభ్​మన్ గిల్​, క్రిస్ ​లిన్​, రసెల్, సునిల్ నరైన్, ఉతప్ప, నితీశ్ రాణా, రింకూ సింగ్, పియూష్ చావ్లా, సందీప్ వారియర్, హ్యారీ గుర్నే.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్​..

రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), లోకేశ్ రాహుల్, క్రిస్​ గేల్​, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, సిమ్రన్ సింగ్(కీపర్), మురుగన్ అశ్విన్, ముజిబర్ రహమాన్, షమి.

AP Video Delivery Log - 0900 GMT News
Thursday, 2 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0859: Mozambique Cyclone STILLS AP Clients Only 4208884
STILLS of damage caused by Cyclone Kenneth
AP-APTN-0851: US TN Recycling Center Fire Must Credit WATE; No Access Knoxville Market; No Use US Broadcast Networks 4208882
Homes evacuated near US recycling centre fire
AP-APTN-0829: Germany VW AP Clients Only 4208880
Volkswagen 1st quarter profit slips on legal risks
AP-APTN-0810: US IA Biden Rally AP Clients Only 4208878
Biden blasts Trump at Iowa rally
AP-APTN-0737: UK Huawei Williamson Part no access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4208873
Reax as UK defence chief fired over Huawei leaks
AP-APTN-0725: Mideast Holocaust Memorial AP Clients Only 4208874
Israel marks Holocaust Remembrance Day
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 3, 2019, 7:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.