ఐపీఎల్-2019 సీజన్ క్వాలిఫయింగ్ మ్యాచ్లు నిర్వహించే తేదీలు ఖరారయ్యాయి. ఫైనల్ మ్యాచ్ను మే 12న హైదరాబాద్లో జరపనున్నారు. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ చెన్నైలో జరిగే అవకాశం ఉంది. చెన్నై పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే ఈ మ్యాచ్కు చెన్నై వేదికవుతుంది. రెండో క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్లకు విశాఖ వేదిక కానుంది.
-
The final of the 12th edition of the Indian Premier League will be played at the Rajiv Gandhi International Stadium in Hyderabad on May 12. Chennai will host Qualifier 1 while Visakhapatnam will host the Eliminator and Qualifier 2. #IPL pic.twitter.com/i9S9LoiLEN
— ANI (@ANI) April 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The final of the 12th edition of the Indian Premier League will be played at the Rajiv Gandhi International Stadium in Hyderabad on May 12. Chennai will host Qualifier 1 while Visakhapatnam will host the Eliminator and Qualifier 2. #IPL pic.twitter.com/i9S9LoiLEN
— ANI (@ANI) April 22, 2019The final of the 12th edition of the Indian Premier League will be played at the Rajiv Gandhi International Stadium in Hyderabad on May 12. Chennai will host Qualifier 1 while Visakhapatnam will host the Eliminator and Qualifier 2. #IPL pic.twitter.com/i9S9LoiLEN
— ANI (@ANI) April 22, 2019
ఫైనల్ మ్యాచ్ మొదట చెన్నైలో నిర్వహించాలని బీసీసీఐ భావించింది. స్టేడియంలోని మూడు స్టాండ్స్ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి తెచ్చుకోవడంలో విఫలమైంది తమిళనాడు క్రికెట్ అసోసియేషన్. ఈ కారణంగా ఫైనల్ మ్యాచ్ వేదికను చెన్నై నుంచి హైదరాబాద్కు మార్చింది బీసీసీఐ పాలక మండలి.
ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్ మ్యాచ్లు మాత్రం విశాఖకు మార్చారు. ఈ మ్యాచ్లు మే 8, 10 తేదీల్లో జరగనున్నాయి.