అందరూ ఊహించినట్లుగానే ఐపీఎల్ 2020 వ్యూయర్షిప్లో రికార్డు సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌కు అదిరిపోయే వ్యూస్ వచ్చాయి. బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బార్క్) లెక్కల ప్రకారం 20 కోట్ల మంది ఈ మ్యాచ్‌ను వీక్షించారు. ప్రపంచంలోనే మరే ఇతర క్రీడా ఈవెంట్‌కు ప్రారంభ రోజు ఇంతటి ఆదరాభిమానం దక్కలేదు.
-
Opening match of #Dream11IPL sets a new record!
— Jay Shah (@JayShah) September 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
As per BARC, an unprecedented 20crore people tuned in to watch the match. Highest ever opening day viewership for any sporting league in any country- no league has ever opened as big as this. @IPL @SGanguly99 @UShanx @DisneyPlusHS
">Opening match of #Dream11IPL sets a new record!
— Jay Shah (@JayShah) September 22, 2020
As per BARC, an unprecedented 20crore people tuned in to watch the match. Highest ever opening day viewership for any sporting league in any country- no league has ever opened as big as this. @IPL @SGanguly99 @UShanx @DisneyPlusHSOpening match of #Dream11IPL sets a new record!
— Jay Shah (@JayShah) September 22, 2020
As per BARC, an unprecedented 20crore people tuned in to watch the match. Highest ever opening day viewership for any sporting league in any country- no league has ever opened as big as this. @IPL @SGanguly99 @UShanx @DisneyPlusHS
'డ్రీమ్ ఎలెవన్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. బార్క్ లెక్క ప్రకారం తొలి మ్యాచ్‌ను ఎవరూ ఊహించని విధంగా 20 కోట్ల మంది చూశారు. క్రీడా చరిత్రలో ఓపెనింగ్ డేకు ఇన్ని వ్యూస్ రావడం ఇదే తొలిసారి.'
-జైషా, బీసీసీఐ సెక్రటరీ.
కరోనా కారణంగా ఐపీఎల్‌ను దుబాయ్‌కు తరలించి ఖాళీ స్డేడియాల్లోనే నిర్వహిస్తున్నారు. సెప్టెంబరు 19న జరిగిన ఈ లీగ్ తొలి మ్యాచ్‌లో సీఎస్కే, ముంబయి తలపడగా.. చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంబటి రాయుడు, డుప్లెసిస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. నవంబరు 10వరకు ఈ టోర్నీ జరగనుంది.