ప్రపంచకప్ మరెంతో దూరంలో లేదు. ఈ సమయంలో భారత క్రికెటర్లను గాయాలు వేధిస్తున్నాయి. ఐపీఎల్లో ఆడుతున్న బౌలర్ బుమ్రా ప్రస్తుతం గాయంతో సతమతమవుతున్నాడు. ఇప్పుడు రోహిత్ శర్మకు గాయమైంది. వీరిద్దరూ ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంజాబ్‌తో మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్‌కు కుడికాలి కండరాలు పట్టేశాయి. ఫలితంగా.. ఈ భారత ఓపెనర్ మైదానం వీడాల్సి వచ్చింది. రోహిత్ గాయంపై బీసీసీఐ, ముంబయి ఇండియన్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
రోహిత్ శర్మకు కనీసం 6 వారాలు విశ్రాంతి అవసరమని సమాచారం. ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ఏప్రిల్ 15న బీసీసీఐ ప్రకటించనుంది. మే 30న ఈ టోర్నీ ఆరంభం కానుంది. టీమిండియాలో రోహిత్ కీలక ఆటగాడు. ఇప్పుడు గాయం మేనేజ్మెంట్ను కలవరపరుస్తోంది.
ఇవీ చదవండి: ప్రపంచకప్ ముందు బుమ్రాకు గాయాల బెడద