ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హర్భజన్‌సింగ్ అరుదైన రికార్డు సాధించాడు. శుక్రవారం దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఓ మైలురాయి అందుకున్నాడు. బ్యాట్స్‌మన్ రూథర్‌ఫర్డ్‌ను ఔట్ చేసిన భజ్జీ.. తన ఖాతాలో 150వ ఐపీఎల్ వికెట్ వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో చెన్నై తరఫున 10 మ్యాచులాడి 16 వికెట్లు తీశాడు.
‘గతంలో నేను ఆడిన క్రికెట్‌కు ఇది పూర్తి భిన్నమైనది. ఈ కొత్త ఫార్మాట్‌లోనూ 150 వికెట్లు తీయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతిక్షణం నా బౌలింగ్‌కు మెరుగులు దిద్దుతూనే ఉంటాను. ఈ సంవత్సరం చాలా వికెట్లు తీశాను. నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చినందుకు ధోనీకి కృతజ్ఞతలు చెప్పాలి’ -హర్భజన్ సింగ్, చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో ముంబయి బౌలర్ మలింగ 169 వికెట్లతో అందరికంటే ముందున్నాడు. ఆ తర్వాత అమిత్ మిశ్రా 156 వికెట్లు తీయగా, హర్భజన్ 150 వికెట్లతో పీయూష్ చావ్లాతో సమానంగా ఉన్నాడు. మరో సీఎస్‌కే బౌలర్ డ్వేన్ బ్రావో 147 వికెట్లతో ఈ క్లబ్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు.