ముంబయి ఇండియన్స్‌తో తమ జట్టు తొలి మ్యాచ్ ఆడటం ఒకరకంగా మంచిదేనని అభిప్రాయపడ్డాడు కోల్‌కతా నైట్ రైడర్స్ సారథి దినేశ్ కార్తీక్. తమ రెండు జట్ల మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని అన్నాడు.
''ముంబయి జట్టు.. ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ ట్రోఫీలను సొంతం చేసుకుంది. వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు ఉన్నారు. బలమైన లైనప్ ఉంది. ఇలాంటి జట్టుతో తొలి మ్యాచ్ ఆడటం మాకు మంచిదే. అయినా ప్రతిఏడాది ఒకేలా ఉండదు. అంతా మంచి జరుగుతుంది. రేపు మా ఇరు జట్ల మధ్య జరిగే పోరు అద్భుతంగా ఉంటుంది.
-దినేశ్ కార్తీక్, కేకేఆర్ సారథి.
తమ జట్టులో శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్‌లను ఓపెనర్లుగా పంపించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపాడు కార్తీక్. వారిద్దరి భాగస్వామ్యం బాగుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా, తమ జట్టులో స్పిన్ దళం బలంగా ఉందని తెలిపాడు. ఐపీఎల్ ముంబయి, కోల్‌కతా 25 సార్లు తలపడగా 19సార్లు రోహిత్ సేన విజయం సాధించింది.
ఇదీ చూడండి ఇకపై మరిన్ని మంచి మ్యాచ్‌లు చూస్తాం: గంగూలీ