కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ సీజన్లో దిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిపోయింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో సూప్ర్ఓవర్లో విజయం సాధించింది క్యాపిటల్స్ జట్టు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. ఇక్కడ సగటున ఓవర్‌కి 9కి పైగా రన్‌రేట్‌తో పరుగులు నమోదవుతున్నాయి.
సూపర్ఓవర్లో దిల్లీ బౌలర్ రబాడ... రసెల్ జోరుకు కళ్లెం వేసి క్యాపిటల్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోపక్క దాదాపు పరాజయం ఖాయమనుకున్న దశలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేరుస్తున్నాడు రసెల్. మరీ రసెల్‌ను మరోసారి రబాడ కట్టడి చేస్తాడో లేదో వేచి చూడాలి.
-
A look at the Points Table after Match 25 of #VIVOIPL pic.twitter.com/9Y9udBL8jA
— IndianPremierLeague (@IPL) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A look at the Points Table after Match 25 of #VIVOIPL pic.twitter.com/9Y9udBL8jA
— IndianPremierLeague (@IPL) April 11, 2019A look at the Points Table after Match 25 of #VIVOIPL pic.twitter.com/9Y9udBL8jA
— IndianPremierLeague (@IPL) April 11, 2019
గత మ్యాచ్‌లో చెన్నైపై తక్కువ స్కోరుకే ఆలౌటై ఓడిన కోల్‌కతా.. ఈ మ్యాచ్‌లో నెగ్గాలని కసితో ఉంది. సొంతగడ్డపై మ్యాచ్ జరగడం దినేష్ కార్తీక్ టీమ్‌కు కలిసొచ్చే అంశం. గత మ్యాచ్‌లో ఆర్సీబీపై గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది దిల్లీ.
జట్లు
దిల్లీ క్యాపిటల్స్
పృథ్వీషా, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాంత్ శర్మ, శిఖర్ ధావన్, కొలిన్ ఇన్ గ్రామ్, క్రిస్ మోరిస్, అక్షర్ పటేల్, రబాడా, రాహుల్ తెవాటియా, రిషబ్ పంత్, సందీప్ లమిచానే,
కోల్ కతా నైట్ రైడర్స్
దినేష్ కార్తీక్ (కెప్టెన్), పీయూష్ చావ్లా, రాబిన్ ఊతప్ప, సునీల్ నరైన్, హారీ గున్రే, ఆండ్రీ రసెల్, క్రిస్ లిన్, కుల్దీప్ యాదవ్, నితీష్ రాణా, ప్రసిధ్ కృష్ణ, శుభ్‌మన్ గిల్