చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఇప్పటికే 3 సార్లు ఫైనల్లో తలపడగా రెండు సార్లు (2013, 2015) ముంబయి గెలవగా... ఒకసారి చెన్నై విజయం సాధించింది.
-
The @mipaltan Skipper Rohit Sharma wins the toss and elects to bat first against @ChennaiIPL.#IPLFinal #MIvCSK pic.twitter.com/807XBZROHo
— IndianPremierLeague (@IPL) May 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The @mipaltan Skipper Rohit Sharma wins the toss and elects to bat first against @ChennaiIPL.#IPLFinal #MIvCSK pic.twitter.com/807XBZROHo
— IndianPremierLeague (@IPL) May 12, 2019The @mipaltan Skipper Rohit Sharma wins the toss and elects to bat first against @ChennaiIPL.#IPLFinal #MIvCSK pic.twitter.com/807XBZROHo
— IndianPremierLeague (@IPL) May 12, 2019
పిచ్.. బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశముంది. వర్షం పడే సూచన కనిపిస్తోంది. ఎనిమిదో సారి ఫైనల్ ఆడబోతుంది చెన్నై. 2010లో మినహా ఫైనల్కెళ్లిన ప్రతిసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది ముంబయి ఇండియన్స్.
జట్టులో ఓ మార్పు చేసింది ముంబయి ఇండియన్స్. జయంత్ యాదవ్ స్థానంలో మిచెల్ మెక్లెనెగన్కు అవకాశం కల్పించింది. చెన్నై కూడా ఓ మార్పుతో బరిలో దిగనుంది. మురళీ విజయ్ స్థానంలో శార్దుల్ ఠాకుర్ ఆడనున్నాడు.
జట్లు
చెన్నై సూపర్‌కింగ్స్...
మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, కీపర్), డుప్లెసిస్, షేన్ వాట్సన్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్,శార్దుల్ ఠాకుర్.
ముంబయి ఇండియన్స్..
రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, మిచెల్ మెక్లెనెగన్, రాహుల్ చాహర్, బుమ్రా, లసిత్ మలింగ.