దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. చెపాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రైనా(59, 37బంతుల్లో) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. చివర్లో ధోనీ(44, 22 బంతుల్లో) అదరగొట్టాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దిల్లీ ఆరంభంలో చెన్నైను కట్టడి చేసినా... చివర్లో పరుగులు సమర్పించుకుంది. దిల్లీ బౌలర్లలో సుచిత్ రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, క్రిస్ మోరిస్ తలో ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు
మొదట్లో నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించింది చెన్నై. తొలి నాలుగు ఓవర్లలో ధోనీ సేన 7 పరుగులు మాత్రమే చేసింది. వాట్సన్ డకౌట్‌గా పెవిలియన్ చేరగా... అనంతరం మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడింది రైనా - డుప్లెసిస్(39) జోడి. వీరిద్దరు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కొద్ది వ్యవధిలోనే వీరిద్దరూ ఔటయ్యారు. అనంతరం జడేజా - ధోనీ జోడి నిలకడగా ఆడుతూ స్కోరు వేగం పెంచింది . జడేజా 10 బంతుల్లో 25 పరుగులతో ధాటిగా ఆడాడు.
-
The #ChinnaThala that we know off! Classic boundaries and strike rotation through that super innings of 59 (37)! #WhistlePodu #Yellove #CSKvDC 💛🦁 pic.twitter.com/RKjryQPFHW
— Chennai Super Kings (@ChennaiIPL) May 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The #ChinnaThala that we know off! Classic boundaries and strike rotation through that super innings of 59 (37)! #WhistlePodu #Yellove #CSKvDC 💛🦁 pic.twitter.com/RKjryQPFHW
— Chennai Super Kings (@ChennaiIPL) May 1, 2019The #ChinnaThala that we know off! Classic boundaries and strike rotation through that super innings of 59 (37)! #WhistlePodu #Yellove #CSKvDC 💛🦁 pic.twitter.com/RKjryQPFHW
— Chennai Super Kings (@ChennaiIPL) May 1, 2019
ధోనీ మెరుపులు..
చివర్లో ఎప్పటిలాగే మహీ మెరుపులు మెరిపించాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 22 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ జట్టుకు భారీ స్కోరునందించడంలో కీలకపాత్ర పోషించాడు ధోనీ. చివరి రెండు ఓవర్లలో 39 పరుగులు పిండుకుంది చెన్నై.
రైనా అర్ధశతకం..
ఈ ఐపీఎల్లో పెద్దగా ప్రభావం చూపని రైనా.. ఈ మ్యాచ్‌లో అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై బౌండరీలు బాదుతూ చెన్నై ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. టీ 20 క్రికెట్లో 50వ అర్ధశతకాన్ని సాధించిన బ్యాట్స్‌మెన్‌గా ఘనత అందుకున్నాడు రైనా.