ETV Bharat / sports

సెంచరీ చేయకపోయినా 'వంద' కొట్టాడు

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్​మెన్ గేల్ అరుదైన ఘనత సాధించాడు. బెంగళూరుతో మ్యాచ్​లో 99 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. టీట్వంటీల్లో 100 సార్లు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్​గా ఖ్యాతికెక్కాడు.

author img

By

Published : Apr 14, 2019, 2:31 PM IST

సెంచరీ చేయకపోయినా 'వంద' కొట్టాడు

క్రిస్ గేల్.. క్రికెట్ అభిమానులు ఆనందంతో గంతులేసే పేరు ఇది. టీట్వంటీల్లో ప్రభంజనం సృష్టించాలంటే వయసు అడ్డం కాదని నిరూపించాడు. 40 ఏళ్లలోనూ అవలీలగా సిక్స​ర్లు కొట్టేస్తున్నాడు. నిన్నటి ఐపీఎల్​ పోరులో​ 99 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అయినా తన పేరిట రికార్డు లిఖించుకున్నాడు.

టీట్వంటీల్లో 100 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు సాధించిన క్రికెటర్​గా ఘనత సాధించాడు. ఈ జాబితాలో వార్నర్ (73 సార్లు) మాత్రమే గేల్ తర్వాత స్థానంలో ఉన్నాడు.

బెంగళూరుతో జరిగిన ఈ మ్యాచ్​లో ఒకవేళ గేల్ సెంచరీ చేసుంటే టీట్వంటీల్లో 22వ శతకం నమోదు చేసేవాడు. కానీ విరాట్, డివిలియర్స్ అర్ధ శతకాలతో రాణించారు. 8 వికెట్ల తేడాతో ఆర్​సీబీ గెలుపొందింది.

ఇది చదవండి: బెంగళూరు బోణి... మెరిసిన కోహ్లి, డివిలియర్స్​

Firozabad (UP) Apr 14 (ANI): While speaking to ANI Pragatisheel Samajwadi Party (Lohia) PSP(L) president Shivpal Singh Yadav said, "We have not put up a candidate against Neta ji or Dimple because we respect Neta ji, we are what we are because of him. As for Dimple, our seniors advised that it is a matter of family, she is our daughter-in-law."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.