సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గత ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఇప్పుడే తలపడుతున్నాయి ఇరు జట్లు. వెన్నునొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు ధోని దూరమయ్యాడు. రైనా కెప్టెన్ బాధ్యతలు స్వీకరించాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశముంది.
-
A look at the Playing XI for #SRHvCSK pic.twitter.com/hTz2Xq0BKS
— IndianPremierLeague (@IPL) April 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A look at the Playing XI for #SRHvCSK pic.twitter.com/hTz2Xq0BKS
— IndianPremierLeague (@IPL) April 17, 2019A look at the Playing XI for #SRHvCSK pic.twitter.com/hTz2Xq0BKS
— IndianPremierLeague (@IPL) April 17, 2019
-
#Thala missing out the game due to the Back spasm picked up during our last game at e-Den! #WhistlePodu #Yellove #SRHvCSK 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) April 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Thala missing out the game due to the Back spasm picked up during our last game at e-Den! #WhistlePodu #Yellove #SRHvCSK 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) April 17, 2019#Thala missing out the game due to the Back spasm picked up during our last game at e-Den! #WhistlePodu #Yellove #SRHvCSK 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) April 17, 2019
సన్‌రైజర్స్ - సూపర్‌కింగ్స్ ఐపీఎల్లో ముఖాముఖి 10 సార్లు తలపడగా రెండు సార్లు మాత్రమే హైదరాబాద్ నెగ్గింది. సొంతగడ్డపై ఆడటం సన్‌రైజర్స్‌కి కలిసొచ్చే అంశం. కానీ పిచ్‌లకు అనుగుణంగా సరైన కాంబినేషన్లతో మైదానంలో అడుగుపెడుతూ విజయాలను సాధిస్తోంది ధోని సేన.
ఓపెనర్లు మినహా మిగతా వారు విఫలమవడం హైదరాబాద్‌కు ప్రతికూలంగా మారింది. జట్టులో ఇప్పటివరకు వార్నర్ 400 పరుగులు చేయగా, బెయిర్ స్టో 304 పరుగులు చేశారు. మరోసారి వీరిద్దరిపైనే సన్‌రైజర్స్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
జట్లు
- సన్ రైజర్స్ హైదరాబాద్
భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), వార్నర్, బెయిర్ స్టో, విలియమ్సన్, విజయ్ శంకర్, సందీప్ శర్మ, నదీమ్, దీపక్ హుడా, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, యూసుఫ్ పఠాన్
- చెన్నై సూపర్ కింగ్స్
సురేష్ రైనా(కెప్టెన్), వాట్సన్, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, రాయుడు, ఇమ్రాన్ తాహిర్, డుప్లెసిస్, కరణ్ శర్మ, దీపక్ చాహర్, షార్దుల్ ఠాకూర్, సామ్ బిల్లింగ్స్(కీపర్)