ఐపీఎల్లో పంజాబ్ జట్టుకు ఓపెనర్‌గా రాణిస్తున్న కేఎల్ రాహుల్‌పై ప్రశంసలు కురిపించాడు విండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్. టీమిండియాకు కోహ్లి తర్వాత ఎక్కువ కాలం పాటు అతడు సేవ చేస్తాడని అన్నాడు. ఎప్పుడూ తన సామర్థ్యానికి తగినట్టు ఆడితేనే సాధ్యమవుతుందని వెల్లడించాడు.
"ప్రస్తుతం టీమిండియా గురించి మాట్లాడితే కేఎల్ రాహుల్ కచ్చితంగా నాకు గుర్తొస్తాడు. విరాట్ తరహాలో అతడు రాణిస్తాడని కోరుకుంటున్నా. కోహ్లి తర్వాత టీమిండియాకు ఎక్కువ కాలం రాహుల్ ఆడతాడు. ఒత్తిడికి గురిచేయకుండా అతడిని అలాగే ఉండనివ్వాలి. ఎవరితోనూ పోల్చవద్దు" -క్రిస్‌గేల్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్
ప్రస్తుత సీజన్లో పంజాబ్ తరఫున ఓపెనింగ్ చేస్తోంది గేల్- రాహుల్ జోడీ. 11 మ్యాచ్‌లాడిన వీరిద్దరూ 450 పరుగులు చేశారు.
"రెండేళ్లుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడుతున్నా. పంజాబీ శైలి బాగుంది. చాలామందితో కలిసి తిరుగుతున్నా. ప్రస్తుత సీజన్లో జట్టును ప్లేఆఫ్‌కు చేర్చడమే మా లక్ష్యం. అక్కడి నుంచి మరింత ముందుకు తీసుకెళ్తాం. అశ్విన్‌కు జాతీయ జట్టులో ఎందుకు చోటు దొరకడం లేదో తెలియదు. చాలా మంచి బౌలర్. అంకితభావం ఉన్న వ్యక్తి" -క్రిస్‌గేల్, కింగ్సె ఎలెవన్ పంజాబ్