ETV Bharat / sports

టీమ్ఇండియానే టైటిల్ ఫేవరెట్: ఇంజమామ్

టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియాకు(T20 World Cup India Team) ఛాంపియన్​గా నిలిచే సత్తా ఉందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్(Inzamam Ul Haq News) అభిప్రాయపడ్డాడు. ఏ విధంగా చూసినా భారత జట్టు దృఢంగా కనిపిస్తోందని తెలిపాడు. భారత్​, పాకిస్థాన్​ మ్యాచ్ అక్టోబర్ 24న జరగనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు ఇంజమామ్.

inzamam ul haq
ఇంజమామ్ ఉల్ హక్
author img

By

Published : Oct 21, 2021, 9:36 PM IST

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియానే(T20 World Cup India Team) టైటిల్‌ ఫేవరెట్‌ అని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌(Inzamam Ul Haq News) అన్నాడు. యూఏఈలోని పరిస్థితులు, టీ20 ఫార్మాట్‌లో ఆటగాళ్ల అనుభవం, ఇలా ఏ విధంగా చూసినా భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నాడు.

"ఏ టోర్నీలోనైనా ఫలానా జట్టు కచ్చితంగా విజేతగా నిలుస్తుందని చెప్పలేం. విజయం సాధించడం అనేది ఆ జట్టు అవకాశాలపై ఆధారపడి ఉంటుంది. నా అంచనా ప్రకారం.. ఈ టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు ఇతర జట్ల కంటే టీమ్‌ఇండియాకే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడి పరిస్థితులు వారికి అనుకూలంగా ఉన్నాయి. ఆ జట్టుకు అనుభవజ్ఞులైన టీ20 ఆటగాళ్లున్నారు" అని ఇంజమామ్‌ అన్నాడు.

అక్టోబరు 24న భారత్, పాక్‌ మధ్య హై ఓల్టేజి మ్యాచ్(Ind vs Pak T20 World Cup) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌ గురించి ఇంజమామ్‌ మాట్లాడాడు.

"సూపర్‌ 12 దశలో భారత్, పాకిస్థాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌ ఫైనల్‌కు ముందు ఫైనల్‌ లాంటిది. ఈ మ్యాచ్‌కు ఉన్నంత క్రేజ్ మరే మ్యాచ్‌కు ఉండదు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇరు జట్లు తలపడిన రెండు మ్యాచ్‌లు ఫైనల్స్‌ను తలపించాయి"

-ఇంజామామ్‌, పాక్ మాజీ ఆటగాడు.

బుధవారం భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌(Ind vs Aus Warm-up Match) గురించి మాట్లాడుతూ.."ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా హాయిగా ఆడింది. 155 పరుగుల లక్ష్యాన్ని భారత్ పెద్దగా శ్రమించకుండానే ఛేదించింది. టీ20ల్లో ఇలాంటి పిచ్‌లపై టీమ్ఇండియా అత్యంత ప్రమాదకరమైన జట్టు" అని వివరించాడు.

కాగా, తన మొదటి వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించిన పాకిస్థాన్‌.. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్‌కు ఇది గట్టిదెబ్బగానే చెప్పవచ్చు.

ఇదీ చదవండి:

'బాబర్.. నీ ప్రణాళికేంటో అర్థం కావడం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.