టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వ(Kohli Captaincy) మార్పుపై వస్తున్న వార్తలను బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమల్ కొట్టిపారేశారు. అక్టోబరులో నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్(ICC T20 Worldcup 2021) ముగసిన వెంటనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొంటాడని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు.
"మీడియాలో వస్తున్న వార్తలన్నీ వదంతులే. నాయకత్వ మార్పుపై బీసీసీఐకి ఎలాంటి ఆలోచనల్లేవు. అన్ని ఫార్మాట్లకు కోహ్లీనే నాయకత్వం వహిస్తాడు."
- అరుణ్ ధూమాల్, బీసీసీఐ కోశాధికారి
అంతకుముందు కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడని ఓ పత్రిక కథనం ప్రచురించింది. తన బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టేందుకే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని అందులో పేర్కొంది. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించి అతడి స్థానంలో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మకు(Rohit Sharma Captaincy) పగ్గాలు అప్పగించనున్నారని తెలిపింది. దీంతో ఆ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
ఇదీ చూడండి.. IND Vs ENG: ఐదో టెస్టు రద్దు దురదృష్టం: కోహ్లీ