చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఫామ్‌పై తనకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. వ్యక్తిగత ప్రదర్శనలు కాకుండా.. జట్టుగా ఎలా ఉన్నాము అన్నదే ప్రస్తుతం తమకు ముఖ్యమన్నాడు.
"ఇది అసలు ఆలోచించాల్సిన విషయమే కాదని నా అభిప్రాయం. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా ఎవరు ఎక్కడ ఉన్నారు అని ఆలోచించట్లేదు. జట్టుగా ఎంత దృఢంగా ఉన్నాము అన్నదే ఇప్పుడు మాకు ముఖ్యం. బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన చేసి జట్టుకు ఉపయోగపడాలని మేము చూస్తున్నాం. ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు ముందుకొచ్చి ఆ బాధ్యత తీసుకోవాలి."
-విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా సారథి.
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీతో పాటు పుజారా, రహానే దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో రాహుల్, జడేజా, బుమ్రా ఆదుకోవడం వల్ల జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. కానీ టీమ్‌లో కీలక ఆటగాళ్లు విఫలమవ్వడం అభిమానులను కలవరపెడుతోంది. లార్డ్స్ వేదికగా రెండో టెస్టు గురువారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో విరాట్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'పంత్ అలాగే ఆడతాడు..'
తొలి ఇన్నింగ్స్‌లో 20బంతుల్లో 25 పరుగులు చేసి దూకుడు మీద కనపడ్డ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. చెత్త షాట్ ఆడి ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో అతడిపైనా విమర్శలు పెరిగాయి. కానీ పంత్‌ను విరాట్ వెనకేసుకొచ్చాడు. పంత్ శైలి అలాగే ఉంటుందని.. అతను అలాగే ఆడాలని అభిప్రాయపడ్డాడు.
"పంత్ అలాగే ఆడతాడు. అతని శైలి కూడా అదే. ఆట రూపురేఖలను మార్చే విధంగా పంత్ ఇన్నింగ్స్ ఉండాలని టీమ్ ఆశిస్తోంది. అతను అలా ఆడితే మ్యాచ్ మావైపు తిరుగుతుంది. పంత్ అలాగే ఆడాలి. ఆడతాడు కూడా. భారీ ఇన్నింగ్స్ ఆడే సత్తా అతనికి ఉంది. పరిస్థితికి తగ్గట్టు ఎలా ఆడాలో ఆర్థం చేసుకునే తెలివి పంత్‌కు ఉంది."
-విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా సారథి.
కొంతకాలంగా విరాట్ కూడా ఫామ్‌లో లేడు. తక్కువ స్కోర్లకే ఔట్ అవుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 0 పరుగులకే ఔట్ అయ్యాడు. విరాట్ తిరిగి ఫామ్‌లోకి రావాలని అభిమానులతో పాటు జట్టు కూడా ఆశిస్తోంది.
ఇదీ చూడండి:- Ind vs Eng: ఆటగాళ్లను వేధిస్తున్న గాయాలు- ఎవరిది పైచేయి?