ETV Bharat / sports

'ఇంగ్లాండ్​తో మ్యాచ్​ అంటే భయపడాల్సిందే!' - Jofra Archer latest news

ఇంగ్లాండ్​తో మ్యాచ్​ అంటే భయపడే పరిస్థితి రాబోతుందని ఆ జట్టు బౌలర్​ జోఫ్రా ఆర్చర్​ జోస్యం చెప్పాడు. రాబోయే రోజుల్లో తమ జట్టుతో మ్యాచ్​ అంటే మిగిలిన టీమ్స్​కు నిద్ర కూడా పట్టదని అభిప్రాయపడ్డాడు.

T20 World Cup: I hope opposition teams are scared when they come up against England, says Jofra Archer
'ఇంగ్లాండ్​తో మ్యాచ్​ అంటే భయపడాల్సిందే!'
author img

By

Published : Oct 14, 2021, 8:40 PM IST

టీ20 ప్రపంచకప్​లో తమ జట్టుతో పోటీ పడాలంటే ఇతర జట్లు భయపడే పరిస్థితి ఉంటుందని ఇంగ్లాండ్​ బౌలర్​ జోఫ్రా ఆర్చర్​ అభిప్రాయపడ్డాడు. బెన్​స్టోక్స్​తో పాటు తాను జట్టులో లేకున్నా.. అత్యున్నత ప్రదర్శన చేసే సత్తా ప్రస్తుత జట్టుకు ఉందని తెలిపాడు. ఇంగ్లాండ్​తో మ్యాచ్​కు ముందు మిగిలిన టీమ్స్​కు నిద్ర కూడా పట్టకపోవచ్చని వెల్లడించాడు.

"గత కొన్నేళ్లలో జట్టుగా మేము విజయవంతంగా కొనసాగుతున్నాం. ర్యాంకింగ్స్​లోనూ టాప్​ పొజిషన్స్​లో ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్​ గమనాన్నే మార్చే సత్తా ఉన్న ఆటగాళ్లు మా టీమ్​లో ఉన్నారు. అవును.. నేను, బెన్​స్టోక్స్​ ఈ టీ20 ప్రపంచకప్​లో ఆడబోవడం లేదు. కానీ.. జట్టు ప్రదర్శనపై నాకు ఎలాంటి ఆందోళన లేదు. టీమ్​లో మేము లేకపోయినా.. మా స్థానాలను భర్తీ చేసేందుకు ఎంతోమంది యువ క్రికెటర్లు ఉన్నారు. టీ20 ప్రపంచకప్​లో మా టీమ్​తో ఆడేందుకు ఇతర జట్లు భయపడే స్థితి వస్తుందని భావిస్తున్నా. మాతో మ్యాచ్​కు ముందు వాళ్లకు నిద్ర కూడా పట్టకపోవచ్చు".

- జోఫ్రా ఆర్చర్​, ఇంగ్లాండ్​ బౌలర్​

2016లో జరిగిన టీ20 ప్రపంచకప్​లో ఓటమి తర్వాత 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్​ విజేతగా నిలిచింది ఇంగ్లాండ్​ క్రికెట్​ టీమ్​. అదే ఉత్సాహంతో ప్రస్తుత టీ20 ప్రపంచకప్​లోనూ గెలిచేందుకు మోర్గాన్​ సేన సన్నద్ధమవుతోంది. ఈ మెగాటోర్నీలో భాగంగా ఇంగ్లాండ్​ జట్టు తమ తొలి మ్యాచ్​లో వెస్టిండీస్​తో​ తలపడనుంది.

ఇదీ చూడండి.. న్యూజిలాండ్​ పర్యటనలో టీమ్ఇండియా కోచ్​గా ద్రవిడ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.