మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్(ICC T20 World Cup 2021) ఘనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూఏఈ, ఓమన్ వేదికల్లో ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. టోర్నీలో డీఎర్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC News) ప్రకటించింది. ఈ నేపథ్యంలో టోర్నీ విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీపై ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేసింది ఐసీసీ.
టీ20 ప్రపంచకప్ విజేతకు రూ.12.02 కోట్ల ప్రైజ్‌మనీని(T20 World Cup Prize Money) బహుకరించనున్నట్లు ఐసీసీ తెలియజేసింది. రన్నరప్ జట్టుకు విజేతకు ఇచ్చే బహుమానంలో సగభాగం అంటే రూ.6 కోట్లకు పైగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. అదేవిధంగా సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లు చెరో రూ.3 కోట్లను అందుకోనున్నాయి.
ఇదీ చూడండి.. ICC News: టీ20 ప్రపంచకప్‌లో ఇదే తొలిసారి