ETV Bharat / sports

అఫ్గాన్ టీ20 ప్రపంచకప్ గెలవొచ్చు: గంభీర్

పాకిస్థాన్​పై భారత జట్టు తప్పకుండా ఆధిపత్యం చెలాయిస్తుందని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. టీ 20 ప్రపంచకప్​ తొలి మ్యాచ్​ భారత్, పాక్​ మధ్య జరగనున్న నేపథ్యంలో గంభీర్​ ఈ వ్యాఖ్యలు చేశాడు.

gambhir, gambhir image
గౌతమ్ గంభీర్
author img

By

Published : Aug 19, 2021, 7:31 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్​లో పాకిస్థాన్​పై భారత్​దే పైచేయి అవుతుందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్​ గంభీర్​ అన్నాడు. అయితే.. ఏ టీమ్​ని తక్కువ అంచనా వేయలేమని తెలిపాడు. టీ20 ప్రపంచకప్​లో భాగంగా తొలి మ్యాచ్​లోనే భారత్, పాకిస్థాన్​ తలపడనున్న నేపథ్యంలో గంభీర్​ ఈ వ్యాఖ్యలు చేశాడు. అక్టోబర్ 24న దుబాయ్​ వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది.

"పాకిస్థాన్​పై కూడా ఆశలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం పాక్​తో పోల్చితే టీమ్​ఇండియా దృఢమైన జట్టు. కానీ, టీ20ల్లో ఎవరు గెలుస్తారో ఎప్పుడూ ఊహించలేం. ఓ జట్టు మరో జట్టుపై గెలుస్తుందని పక్కాగా అంచనా వేయలేం. ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదు."

-గౌతమ్ గంభీర్, క్రికెటర్.

అఫ్గానిస్థాన్​ జట్టును కూడా తక్కువ చేయకూడదని గంభీర్ అన్నాడు. రషీద్​ వంటి ఆటగాళ్లు మ్యాచ్ గమనాన్నే మార్చేస్తారని తెలిపాడు. "పాకిస్థాన్​ జట్టులోను అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవచ్చు. కానీ, భారత్​తో ఆడేప్పుడు.. పాకిస్థాన్​పై ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది" అని అన్నాడు. పరిస్థితులు తారుమారైతే అఫ్గాన్​ జట్టు కప్​ గెలిచే అవకాశముందని వ్యాఖ్యానించాడు.

ఇదీ చదవండి:'ఇప్పుడైనా నవ్వు బాబు'.. గంభీర్​కు యూవీ పంచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.