ETV Bharat / sports

ENG Vs PAK: కివీస్​ బాటలో ఇంగ్లాండ్​.. పాకిస్థాన్​ పర్యటన రద్దు - england tour of pakistan cancelled

భద్రతా కారణాలతో న్యూజిలాండ్​ జట్టు పాకిస్థాన్​ పర్యటనను(ENG Vs PAK) రద్దు చేసుకోగా.. ఇప్పుడదే బాటలో ఇంగ్లాండ్​ టీమ్​ పయనించింది. వచ్చే నెలలో పాక్​తో జరగనున్న సిరీస్​ను రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు(England Cricket News) ఓ ప్రకటనలో తెలియజేసింది.

After NZ, England too calls off tour of Pakistan over security concerns
కివీస్​ బాటలో ఇంగ్లాండ్​.. పాకిస్థాన్​ పర్యటన రద్దు
author img

By

Published : Sep 21, 2021, 7:28 AM IST

పాకిస్థాన్‌ క్రికెట్​కు మరో షాక్‌! ఇంగ్లాండ్‌ కూడా న్యూజిలాండ్‌లో బాటలో పయనించింది. భద్రత కారణాలతో పాకిస్థాన్‌ పర్యటనను(England Cricket News) రద్దు చేసుకుంది. ఇంగ్లాండ్‌ పురుషులు, మహిళల జట్లు వచ్చే నెలలో పాక్‌లో(ENG Vs PAK 2021) పర్యటించాల్సివుంది.

"పాకిస్థాన్‌ పర్యటనపై ఈసీబీ లోతుగా చర్చించింది. పురుషులు, మహిళల జట్లను పర్యటనకు పంపరాదని నిర్ణయించింది. క్రీడాకారులు, సహాయ సిబ్బంది మానసిక, శారీరక క్షేమం అన్నింటికంటే ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా ముఖ్యం."

- ఇంగ్లాండ్​ క్రికెట్ బోర్డు

షెడ్యూలు ప్రకారం ఇంగ్లాండ్‌ పురుషుల జట్టు అక్టోబరు 13, 14వ తేదీల్లో పాక్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సివుంది. ఇంగ్లాండ్‌ మహిళల జట్టు రెండు టీ20లు, మూడు వన్డేల్లో పోటీపడాల్సింది. తొలి వన్డేకు కొన్ని నిమిషాల ముందు.. న్యూజిలాండ్‌ జట్టు పాకిస్థాన్‌ పర్యటనను(New Zeland Vs Pakistan) రద్దు చేసుకుంది.

ఇదీ చూడండి.. KKR vs RCB: బ్యాటింగ్​, బౌలింగ్​లో విఫలమైన ఆర్​సీబీ.. కారణమదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.