ETV Bharat / sports

డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్​ షురూ- భారత్​ షెడ్యూల్ ఇదే.. - డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్

ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​​ రెండో ఎడిషన్​ (2021-23)లో భాగంగా టీమ్ఇండియా షెడ్యూల్​ ఖరారైంది. మొత్తం ఐదు టెస్ట్​ సిరీస్​లు ఆడనుంది కోహ్లీసేన. ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్​తో ప్రారంభం కానున్న టెస్ట్​ సిరీస్​తో ఈ సీజన్​ మొదలవుతుంది. బంగ్లా పర్యటనలో భాగంగా రెండు మ్యాచ్​ల సిరీస్​తో ఈ సీజన్​ ముగుస్తుంది.

wtc second edition, team india
డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్, టీమ్ఇండియా
author img

By

Published : Jun 25, 2021, 6:59 PM IST

సుదీర్ఘ ఫార్మాట్లో ప్రపంచకప్​లా భావించిన ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ను ఓటమితో ముగించింది టీమ్ఇండియా. తొలిసారి జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ విజయం సాధించింది. రెండో విడత ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​లో భాగంగా వచ్చే రెండేళ్ల (2021-23)కు గానూ టీమ్ఇండియా షెడ్యూల్​ వచ్చేసింది. ఇందులో భాగంగా మొత్తం 5 సిరీస్​లు ఆడనుంది. ఇంగ్లాండ్​తో సిరీస్​తో ఈ సీజన్​ మొ​దలు అవ్వనుండగా.. బంగ్లాతో సిరీస్​తో దానికి ముగింపు పలకనుంది.

ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న కోహ్లీసేనకు.. ఆగస్టు 4న ఇంగ్లాండ్​తో జరిగే ఐదు టెస్ట్​ల సిరీస్​తో డబ్ల్యూటీసీ తదుపరి సీజన్​ ప్రారంభం కానుంది. తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్​తో టెస్ట్​ సిరీస్​ ఆడనుంది భారత్​. రూట్​సేనతో సిరీస్ అనంతరం దుబాయ్​ వేదికగా మిగిలిన ఐపీఎల్​ సీజన్​ ఆడనుంది. అనంతరం పొట్టి ప్రపంచకప్​ జరగనుంది. దీని తర్వాత నవంబర్​లో కివీస్​తో సిరీస్​ ఆడే అవకాశం ఉంది.

డిసెంబర్​-జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. అనంతరం శ్రీలంకతో 3 టెస్ట్​ల సిరీస్​కు ఆతిథ్యమివ్వనుంది. తర్వాత సుదీర్ఘ ఫార్మాట్​కు కొద్దిగా విరామం ఇవ్వనుంది కోహ్లీసేన. 2022 రెండో సగంలో బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది భారత్. ఇక చివరగా బంగ్లాతో జరిగే రెండు టెస్ట్​ల సిరీస్​తో డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్​ ముగియనుంది.

తొలి ఎడిషన్​లో అంచనాలు అందుకుని ఫైనల్​కు చేరుకున్న విరాట్ సేన.. తుదిపోరులో కివీస్​ చేతిలో ఓటమి పాలైంది. రెండో విడతలోనూ ఇదే విధంగా రాణించాలని టీమ్ఇండియా యోచిస్తోంది. ఇక ఫైనల్లో ఏకైక మ్యాచ్​ ఉండకూడదనే తన నిర్ణయాన్ని బహిరంగంగానే చెప్పాడు కోహ్లీ. దీంతో రానున్న ఎడిషన్​లో ఐసీసీ ఏమైనా మార్పులు చేస్తుందేమో చూడాలి.

ఇదీ చదవండి: PSL: విజేతగా 'సుల్తాన్స్'.. ఐపీఎల్​తో పోలిస్తే ప్రైజ్​మనీ ఎంత?

డబ్ల్యూటీసీ రెండో విడత షెడ్యూల్​..

ఇంగ్లాండ్​ పర్యటనలో భాగంగా భారత్​ ఐదు మ్యాచ్​లు ఆడనుంది. ఈ సిరీస్​తో డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్ ప్రారంభం అవుతుంది.

  • తొలి టెస్ట్​: ఆగస్టు 4-8, ట్రెంట్ బ్రిడ్జ్​.
  • రెండో టెస్ట్​: ఆగస్టు 12-16, లార్డ్స్​.
  • మూడో టెస్ట్​: ఆగస్టు 25-29, హెడింగ్లీ.
  • నాల్గో టెస్ట్​: సెప్టెంబర్ 2-6, కెన్నింగ్టన్​ ఓవల్.
  • ఐదో టెస్ట్​: సెప్టెంబర్ 10-14, ఓల్డ్​ ట్రాఫోర్డ్​.

స్వదేశంలో కివీస్​తో టెస్ట్​ సిరీస్​కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఇందులో రెండు మ్యాచ్​లు ఆడనుంది. ఈ సిరీస్​ నవంబర్​లో జరిగే అవకాశాలున్నాయి.

డిసెంబర్​-జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. అక్కడ 3 టెస్టులు ఆడనుంది.

శ్రీలంకతో 3 మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​కు భారత్​ ఆతిథ్యమివ్వనుంది.

రెండు టెస్ట్​ల సిరీస్​లో భాగంగా బంగ్లా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. డబ్ల్యూటీసీ రెండో విడతలో ఇదే చివరి సిరీస్.

ఇదీ చదవండి: Team India: కివీస్​పై ఓటమి.. మారిన బీసీసీఐ ఆలోచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.