ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను టీమ్‌ఇండియా గెలవాలంటే పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఫామ్ ఎంతో కీలకమని మాజీ సెలక్టర్ సాబా కరీమ్ అన్నాడు. తక్కువ సమయంలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్లో ఎదిగాడని ప్రశంసించాడు. ఫిట్‌గా ఉండాలన్నా ఒత్తిడి అతడిపై ఉంటోందని పేర్కొన్నాడు.
"ఐపీఎల్‌లో గత 3-4 మ్యాచుల్లో బుమ్రా ఫామ్ చూశాం. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అతడు మంచి ఫామ్ కనబరిస్తే మన గెలుపు అవకాశాలు మరింత పెరుగుతాయి. టీమ్ఇండియాలో బుమ్రా కీలక పేసర్. అతడు మూడు ఫార్మాట్లలో జట్టుకు ఆడుతున్నాడు. అందుకే ఎప్పుడూ ఫిట్ ఉండాలనే, మెరుగ్గా ఆడాలనే ఒత్తిడి అతడిపై ఉంటుంది. టెస్టుల్లో అతనెప్పడూ బాగా ఆడతాడు. అతడో భిన్నమైన పేసర్. అంతేకాకుండా బుమ్రా బౌలింగ్‌లో చాలా వేగం ఉంటుంది. చక్కని షార్ట్‌పిచ్ బంతులు విసురుతాడు. మెల్లమెల్లగా అంతర్జాతీయ క్రికెట్లో బుమ్రా ఆధిపత్యం పెరుగుతోంది"
- కరీమ్, టీమ్‌ఇండియా మాజీ సెలక్టర్
నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్‌లో బుమ్రా మోస్తరు ప్రదర్శన చేశాడు. అయితే, ఆస్ట్రేలియా సిరీసు తర్వాత అతడు వ్యక్తిగత కారణాలతో విరామం తీసుకున్నాడు.
ఇదీ చూడండి: 'టెస్టుల్లో బుమ్రా 400 వికెట్లు తీయడం పక్కా!'