ETV Bharat / sports

మూడేళ్లలో అమ్మాయిలకు 65 మ్యాచ్‌లు, తొలిసారి ఎఫ్​టీపీ షెడ్యూల్​ - భారత అమ్మాయిల క్రికెట్​ జట్టు ఎఫ్​టీపీ

భారత మహిళల క్రికెట్​ జట్టు రానున్న మూడేళ్లలో 65 అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడనుంది. తొలిసారిగా మహిళల క్రికెట్లో రూపొందించిన భవిష్య పర్యటన ప్రణాళికను ఐసీసీ ప్రకటించింది.

indian women cricket team
Indian women cricket teamharat
author img

By

Published : Aug 17, 2022, 6:49 AM IST

Indian Women Team FTP Schedule: రానున్న మూడేళ్లలో భారత మహిళల క్రికెట్‌ జట్టు 65 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. తొలిసారిగా మహిళల క్రికెట్లో రూపొందించిన భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ) 2022-2025 చక్రాన్ని మంగళవారం ఐసీసీ ప్రకటించింది. ఈ మూడేళ్ల ఎఫ్‌టీపీలో ఏడు టెస్టులు, 135 వన్డేలు, 159 టీ20లతో కలిపి మొత్తం 301 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో భారత్‌ 2 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలతో ఒక్కో టెస్టు మ్యాచ్‌లో తలపడుతుంది.

2022 మే నెల నుంచి కొత్త ఎఫ్‌టీపీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భారత అమ్మాయిలు ఇప్పటికే శ్రీలంకతో మూడేసి వన్డేలు, టీ20లు ఆడేశారు. ఎఫ్‌టీపీ ప్రకారం సొంతగడ్డపై న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌లతో భారత్‌ తలపడనుంది. ఆసీస్‌, ఇంగ్లాండ్‌, శ్రీలంక (ఇప్పటికే ఆడేసింది), బంగ్లాదేశ్‌లతో ప్రత్యర్థి జట్ల వేదికల్లో పోటీపడుతుంది. ఇక ఎఫ్‌టీపీలోని ఏడు టెస్టుల్లో ఇంగ్లాండ్‌ అత్యధికంగా అయిదు, ఆసీస్‌ నాలుగు, దక్షిణాఫ్రికా మూడు, టీమ్‌ఇండియా రెండు మ్యాచ్‌లు ఆడనుంది.

ఇవీ చదవండి: ఒక్క ఇన్నింగ్స్ చాలు, ఆసియా కప్​లో మునుపటి కోహ్లీని చూస్తాం

స్టార్ క్రికెటర్​ ఆటకు వీడ్కోలు, సెలక్టర్స్​ వల్లే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.