ETV Bharat / sports

తొలి డేనైట్ టెస్టుకు సిద్ధమైన భారత మహిళా జట్టు

ఈ ఏడాది ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​కు సిద్ధమవుతోంది భారత మహిళా జట్టు. అయితే ఈ సిరీస్​లో ఓ డేనైట్ మ్యాచ్​ కూడా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు.

Indian women
భారత మహిళా జట్టు
author img

By

Published : May 20, 2021, 10:56 AM IST

తమ తొలి డేనైట్ టెస్టు ఆడేందుకు సిద్ధమవుతోంది భారత మహిళా క్రికెట్ జట్టు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నామని వెల్లడించారు. మహిళల క్రికెట్​ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

  • Taking forward our commitment towards women's cricket, I am extremely pleased to announce that Team India @BCCIwomen will play in their first-ever pink ball day-night Test later this year in Australia.

    — Jay Shah (@JayShah) May 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మహిళల క్రికెట్ పట్ల మా నిబద్ధతకు కట్టుబడి ఉన్నాం. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్​లో టీమ్ఇండియా మహిళలు తొలి పింక్ బాల్ టెస్టు ఆడబోతున్నారని తెలిపేందుకు సంతోషిస్తున్నా" అని జై షా ట్వీట్ చేశారు.

ఏడేళ్ల తర్వాత ఇంగ్లాండ్​లో టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది భారత మహిళా జట్టు. జూన్ 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో పాల్గొననుంది. తర్వాత టీ20, వన్డే సిరీస్​లూ జరగనున్నాయి. ఇంకా షెడ్యూల్​ ప్రకటించనప్పటికీ సెప్టెంబర్ మధ్యలో ఈ పర్యటన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చివరసారిగా ఆసీస్​తో 2006లో టెస్టు మ్యాచ్ ఆడారు టీమ్ఇండియా మహిళలు.

అలాగే మహిళల క్రికెట్ చరిత్రలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే గులాబి టెస్టు రెండోది మాత్రమే. 2017లో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా తొలిసారిగా డేనైట్ టెస్టులో తలపడ్డాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.