ETV Bharat / sports

అర్థం లేదనిపించింది.. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నా: మిథాలీ రాజ్​ - మిథాలీరాజ్ రిటైర్మెంట్​

మహిళలకు టీ20 లీగ్‌ ఆరంభించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని, నాణ్యమైన క్రికెటర్లు వెలుగులోకి వస్తారని చెప్పింది దిగ్గజం మిథాలీ రాజ్‌. దీంతో పాటు తాను ఇప్పుడే ఎందుకు రిటైర్‌కావాలని నిర్ణయించుకుందో? తర్వాత ఏం చేయబోతుంది? సహా పలు విషయాలను తెలిపింది. ఆ సంగతులివీ..

mithali raj retirement
మిథాలీరాజ్​ రిటైర్మెంట్​
author img

By

Published : Jun 13, 2022, 6:52 AM IST

రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో ఎన్నో రికార్డులు, మరెన్నో ఘనతలు. భారత్‌ మహిళల క్రికెట్‌ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన దిగ్గజం మిథాలీ రాజ్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఓ గొప్ప ఇన్నింగ్స్‌కు ముగింపు పలుకుతూ ఆమె ఇటీవలే ఆటకు వీడ్కోలు పలికింది. అయితే మిథాలీ ఇప్పుడే ఎందుకు రిటైర్‌కావాలని నిర్ణయించుకుంది? ఇంతకాలం క్రికెట్‌తో ప్రయాణం చేసిన ఆమె తర్వాత ఏమి చేయనుంది? మహిళల క్రికెట్‌ భవితవ్యంపై ఏమంటోంది..? వంటి విషయాల సమాహారమే ఈ కథనం..
ఫామ్‌లో ఉండగానే క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని ముందే అనుకున్నారా?
ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమేం కాదు. చాలా ముందే అనుకున్నాను. వన్డే ప్రపంచకప్‌లో నిరాశ ఎదురైంది. దాని నుంచి బయటపడేందుకు కాస్త సమయం పట్టింది. ప్రపంచకప్‌ సాధించాలని కలగన్నాను. ఇంకో ప్రపంచకప్‌ ఆడే పరిస్థితి లేదు. అలాంటప్పుడు క్రికెట్లో కొనసాగడంలో అర్థం లేదు. ఇంతకాలం ఏ లక్ష్యంతో ఆడానో దాన్ని అందుకోలేకపోయాను. అందుకే ఇంకొంతకాలం ఆడే సత్తా ఉన్నప్పటికీ వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను.

ఎవరికి సాధ్యం కాని విధంగా 23 ఏళ్లు క్రికెట్‌ ఆడారు. మీకు ఏమనిపిస్తోంది?
ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. మహిళల క్రికెట్లో ఎన్నో మార్పులను ప్రత్యక్షంగా చూశాను. ఎన్నో మధుర విజయాలనూ అందుకున్నాను. నీలి జెర్సీ వేసుకుని మైదానంలో బరిలో దిగితే లభించే అనుభూతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దేశం కోసం ఇన్నేళ్లు ఆడినందుకు ఆనందంగా ఉంది. ప్రపంచకప్‌ గెలవలేదన్న అసంతృప్తి మినహాయిస్తే కెరీర్‌పై పూర్తి సంతృప్తితో ఉన్నాను.
భారత మహిళల జట్టు నంబర్‌వన్‌ ర్యాంకు సాధించడానికి ఇంకెంత సమయం పట్టొచ్చు?
సరైన ప్రణాళికతో ముందుకెళ్తే అయిదేళ్లలో భారత్‌ను నం.1 జట్టుగా చూడొచ్చు. ప్రస్తుతం జట్టులో నాణ్యమైన యువ ప్లేయర్లు చాలామంది ఉన్నారు. ఎస్‌.మేఘన, యాస్తిక, షెఫాలీ ఇప్పటికే తామేంటో నిరూపించుకున్నారు. ఇంకో పదేళ్లు జట్టులో కొనసాగే సత్తా వీరికుంది. వీళ్లతో పాటు జట్టులోని యువ క్రికెటర్లను నిలకడగా, బాధ్యతగా ఆడేలా తయారు చేస్తే మహిళల క్రికెట్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది. బ్యాటింగ్‌ పరంగా జట్టు ఆలోచించాల్సిన పనిలేదు. అయితే ప్రత్యేకంగా బౌలింగ్‌పై దృష్టిసారించాల్సిన అవసరముంది.
ఎక్కువగా టెస్టు క్రికెట్‌ ఆడకపోవడం నష్టం చేస్తుందా?
టెస్టు క్రికెట్‌ ఎక్కువగా ఆడటం క్రికెటర్‌కు ఎంతో అవసరం. సాంకేతికంగా, శారీరకంగా, మానసికంగా క్రికెటర్‌కు టెస్టు క్రికెట్‌ అసలైన పరీక్ష పెడుతుంది. సుదీర్ఘ సమయం మైదానంలో ఆడటం వల్ల టెక్నిక్‌ కూడా మెరుగవుతుంది. అయినా ఇప్పుడు టెస్టులు ఎక్కువగా ఆడే అవకాశం కనిపించడం లేదు. అంతా ఫాస్ట్‌ క్రికెట్‌నే ఇష్టపడుతున్నారు. మహిళల క్రికెట్‌కు ఎక్కువ ప్రాచుర్యం తేవడం కోసం ఐసీసీ కూడా పరిమిత ఓవర్ల క్రికెట్‌పైనే దృష్టి సారిస్తోంది. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా ఇలా అన్ని దేశాల్లో టీ20 లీగ్‌లు వస్తున్నాయి. అలాంటప్పుడు టెస్టు క్రికెట్‌ ఎలా సాధ్యమవుతుంది.
మహిళల టీ20 లీగ్‌పై ఏమంటారు?
మహిళలకు టీ20 లీగ్‌ ఆరంభించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. నాణ్యమైన క్రికెటర్లు వెలుగులోకి వస్తారు. ప్రస్తుతం భారత పురుషుల క్రికెట్‌ అత్యుత్తమ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం టీ20 లీగ్‌. దేశవాళీ క్రికెటర్ల గురించీ దేశమంతా మాట్లాడుకునేలా చేసింది. మహిళల క్రికెట్లోనూ అలాంటి మార్పులకు కారణం కావొచ్చు. దేశవాళీ మ్యాచ్‌లతో పాటు సత్తా చాటేందుకు అమ్మాయిలకు టీ20 లీగ్‌ మరో వేదికగా నిలుస్తుంది.
క్రికెటర్‌గా రిటైరయ్యారు.. తర్వాతేంటి? ఆటతో బంధం కొనసాగుతుందా?
కచ్చితంగా క్రికెట్లో కొనసాగతాను. ఏ బాధ్యతలో అన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. కోచ్‌గా పూర్తిస్థాయిలో పనిచేయాలని లేదు. కానీ మెంటార్‌గా ఉండేందుకు సిద్ధం. ఇన్నేళ్లు క్రికెటర్‌గా సేవలందంచాను. ఈ అనుభవంతో మహిళల క్రికెట్‌ అభివృద్ధికి మరింత కృషి చేస్తా. అవకాశమొస్తే క్రికెట్‌ పాలనలో బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం. వ్యాఖ్యతగానూ చూడొచ్చు. కాస్త విశ్రాంతి తీసుకుని భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటాను.

ఇదీ చూడండి: బీసీసీఐకి కాసుల వర్షం.. ఐపీఎల్​ ప్రసార హక్కుల వేలంలో తొలిరోజే రూ.42వేల కోట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.