ETV Bharat / sports

కొత్త కోచ్ ఎంపికపై మహిళల క్రికెట్​లో రగడ

మహిళల క్రికెట్​ జట్టు కోచ్​గా తిరిగి రమేష్ పొవార్​ను ఎంపిక చేయడం.. మాజీ కోచ్​ రామన్​ను సరైన కారణం లేకుండా తప్పించడం ఇప్పుడు భారత క్రికెట్​లో దుమారం రేపుతోంది. గతంలో మిథాలీతో పొవార్ గొడవ కారణంగా జట్టు వాతావరణమే దెబ్బతింది. ఇప్పుడు మిథాలీ నాయకత్వంలో భారత జట్టు 2022 వన్డే ప్రపంచకప్​కు సిద్ధమవుతున్న తరుణంలో పొవార్ తిరిగి కోచ్ బాధ్యతలు చేపట్టడం సరైందేనా అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది.

wv raman, former coach
డబ్ల్యూవీ రామన్, భారత మహిళల జట్టు మాజీ కోచ్
author img

By

Published : May 15, 2021, 7:04 AM IST

భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ పదవికి 35 మంది దరఖాస్తు చేసుకోగా.. రెండేళ్లకు పైగా పదవిలో ఉన్న డబ్ల్యూవీ రామన్​తో పాటు ఆయన కంటే ముందు బాధ్యతలు నిర్వర్తించిన రమేశ్ పొవార్, ఇంకో ఆరుగురు మాజీ భారత క్రికెటర్లను ఇంటర్వూలకు ఎంపిక చేసింది మదన్ లాల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ. ఇంటర్వ్యూల అనంతరం చివరికి పొవారును కోచ్​గా ప్రకటించారు. అయితే ఇంటర్వ్యూ ప్రక్రియలో ఈ కమిటీ పారదర్శకంగా వ్యవహరించలేదని, సరైన కారణం లేకుండానే రామన్​ను పక్కన పెట్టారన్న ఆరోపణలొస్తున్నాయి.

కమిటీలో ఓ సభ్యుడైన ఆర్పీ సింగ్ తండ్రి మరణం కారణంగా ఈ ప్రక్రియకు దూరంగా ఉండగా.. మదన్ లాల్​తో పాటు సులక్షణ నాయక్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే సులక్షణ.. ముంబయి క్రికెట్ సంఘం కార్యదర్శి సంజయ్ నాయక్ సోదరి అని, ఈ నేపథ్యంలో ముంబయి వాడైన పొవార్​ను తిరిగి కోచ్​గా ఎంపిక చేయడం కోసం రామన్ పట్ల పక్షపాతం చూపించిందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. నిరుడు టీ20 ప్రపంచకప్​లో భారత మహిళల జట్టు రామన్ శిక్షణలో రన్నరప్​గా నిలవగా.. దాన్ని పట్టించుకోకుండా ఇటీవలి దక్షిణాఫ్రికా సిరీస్​లో భారత జట్టు వైఫల్యానికి ఆయన్ని బాధ్యుడిని చేస్తూ పక్కన పెట్టడానికి సులక్షణ మొగ్గు చూపిందని వార్తలు వస్తున్నాయి. ఆ సిరీస్​లో విధ్వంసక ఓపెనర్ షెఫాలీని వన్డే సిరీస్​కు దూరం పెట్టడం, సీనియర్ ఫాస్ట్ బౌలర్ శిఖా పాండేను ఫిట్ నెస్ కారణాలు చెప్పి తప్పించడంపై కోచ్ రామన్ విభేదించాడు. వారి స్థానంలో అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలకు తూగని వారిని ఎంపిక చేశారని.. నీతు డేవిడ్ నాయకత్వంలోని సెలక్టర్లతో అతను గొడవ పడ్డాడని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. కాబట్టి ఆ సిరీస్ వైఫల్యానికి రామన్​ను బాధ్యుడిని చేయడం సరికాదన్నది కొందరి వాదన.

గతంలో మిథాలీతో పొవార్ గొడవ కారణంగా జట్టు వాతావరణమే దెబ్బ తినగా.. ఇప్పుడు మిథాలీ నాయకత్వంలో భారత జట్టు 2022 వన్డే ప్రపంచకప్​​కు సిద్ధమవుతున్న తరుణంలో పొవార్ తిరిగి కోచ్ బాధ్యతలు చేపట్టడం సరైందేనా అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. సీఏసీ చైర్మన్ అయిన మదన్ లాల్ మార్చిలోనే 70వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. కాగా లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం 70 ఏళ్లు నిండిన వాళ్లెవ్వరూ భారత క్రికెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. ఏ బాధ్యతలు చేపట్టకూడదు. ఈ నేపథ్యంలో ఆయన నేతృత్వంలోని కమిటీ చేపట్టిన కోచ్ ఎంపిక చెల్లదనే వాదనా వినిపిస్తోంది. దీనిపై ఎవరైనా కోర్టు కెక్కితే బీసీసీఐకి ఇబ్బందులు తప్పక పోవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో సీఏసీ ఇంటర్వ్యూ ప్రక్రియ నిర్వహించిన తీరుపై బీసీసీఐ దృష్టి పెట్టాలన్న డిమాండ్లు వస్తున్నాయి.

ఇదీ చదవండి: జట్టు కోసం ఏదైనా చేస్తా: హనుమ విహారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.