'స్క్విడ్‌గేమ్'(squid game movie netflix).. ప్రస్తుతం ఎక్కడ చూసిన సినీప్రియులు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో(squid game review) విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోందీ చిత్రం. ఇప్పుడా వెబ్ సిరీస్‌లోని 'డల్గోనా క్యాండీ' ఛాలెంజ్‌ను(squidgame movie challenges) స్వీకరించి అభిమానులను సోషల్‌మీడియా వేదికగా అలరిస్తున్నారు టీమ్ఇండియా ప్లేయర్స్. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ పోస్ట్ చేసింది. 'నరాలు తెగే ఉత్కంఠకు గురిచేసే గేమ్‌లో' టీమ్ఇండియా పాల్గొంది అని వ్యాఖ్య జోడించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ ఛాలెంజ్‌లో భాగంగా క్యాండీలో ఉన్న ఆకారాన్ని ఏమాత్రం దెబ్బతినకుండా బయటకు తీయాలి. అలా తీయలేకపోయిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేయడం ఈ వెబ్‌సిరీస్‌లో చూడొచ్చు. ఆ సవాల్నే మన ప్లేయర్స్ సరదాగా తీసుకుని ఆడారు.
ఈ గేమ్‌లో రోహిత్ శర్మ, మహ్మద్ షమి గెలవగా.. సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఓడిపోయారు. టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 24 పాకిస్థాన్‌తో(t20 worldcup teamindia pakisthan match) తలపడనుంది. ఈ పోరు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చూడండి:
నమ్జా-చింగూ, యోజా చింగూ.. ఎక్కడ చూసినా కొరియన్ హవా!