ETV Bharat / sports

టీమ్ఇండియా ఆటగాడికి కరోనా పాజిటివ్​

sdvgf
టీమ్ఇండియా ఆటగాడికి కరోనా పాజిటివ్​
author img

By

Published : Jul 15, 2021, 8:20 AM IST

Updated : Jul 15, 2021, 9:06 AM IST

08:12 July 15

బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటన

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారతీయ క్రికెటర్లలో ఒకరికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. 23 మంది క్రికెటర్లతో కూడిన బృందం ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తుండగా వారిలో ఒకరికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. ప్రస్తుతం ఆ క్రికెటర్‌కు ఎలాంటి కరోనా లక్షణాలు లేనప్పటికీ అతన్ని విడిగా క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.  

ఆ క్రికెటర్‌ మిగతా జట్టుతో పాటు డర్హమ్ వెల్లలేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఏ క్రికెటర్‌ కొవిడ్ బారిన పడ్డాడో స్పష్టంగా తెలియజేయనప్పటికీ ప్రస్తుతం బ్రిటన్‌లో వ్యాప్తిలో ఉన్న డెల్టా వేరియంట్ సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. యూకేలో కొవిడ్ కేసులు పెరుగుతున్న వేళ జాగ్రత్తగా ఉండాలంటూ బీసీసీఐ కార్యదర్శి జైషా ఇటీవల పంపిన ఈ మెయిల్‌తో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. డబ్ల్యూటీసీ ఛాంపియన్‌ షిప్ ముగియగానే ఇంగ్లాండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ కోసం టీమిండియా అక్కడే క్వారంటైన్‌లో ఉంది. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి:Tokyo Olympics: బ్రెజిల్‌ జట్టు హోటల్లో కరోనా కలకలం

Last Updated : Jul 15, 2021, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.