ETV Bharat / sports

IND vs SL: జోరు మీద టీమ్ఇండియా.. గెలుపు ఆశతో శ్రీలంక

author img

By

Published : Jul 19, 2021, 10:08 PM IST

యువ క్రికెటర్లతో జోరు మీదున్న టీమ్​ఇండియా.. తొలి వన్డేలో విజయంతో జట్టుకు మరింత ఉత్సాహం లభించింది. తొలి వన్డే ప్రదర్శనను కొనసాగిస్తూ.. రెండో మ్యాచ్​లోనూ గెలుపొంది, సిరీస్​ కైవసం చేసుకోవాలని గబ్బర్​ సేన సన్నాహాలు చేస్తోంది. ఈ మ్యాచ్​లో గెలిచి సిరీస్​పై ఆశలు నిలబెట్టుకోవాలని లంక జట్టు ప్రణాళికలు రచిస్తోంది.

India will aim to stamp authority over Sri Lanka in second ODI
టీమ్ఇండియా జోరుకు లంక బౌలర్లు కళ్లెం వేయగలరా?

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో గెలుపొందిన ఉత్సాహంతో రెండో వన్డేకు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. అలాగే మంగళవారం జరగనున్న మ్యాచ్​లో గెలిచి సిరీస్​పై ఆశలు నిలబెట్టుకోవాలని శ్రీలంక జట్టు చూస్తోంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్​ మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కానుంది.

మార్పు లేదు!

తొలి వన్డేలో సూర్యకుమార్​ యాదవ్​, ఇషాన్​ కిషన్​ అరంగేట్రం చేయగా.. ఆ మ్యాచ్​లో ఇద్దరూ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఇషాన్​ కిషన్​ చేసిన హాఫ్​సెంచరీతో పాటు శిఖర్​ ధావన్​ కెప్టెన్​ ఇన్నింగ్స్​ టీమ్ఇండియా విజయానికి బాటలు వేశాయి. వీరితో పాటు ఓపెనర్​ పృథ్వీషా, సూర్యకుమార్​ యాదవ్​ అద్భుతంగా బ్యాటింగ్​ చేశారు. భారత బ్యాట్స్​మెన్​ను కట్టడి చేసేందుకు లంక బౌలర్లు అనేక ప్రయత్నాలు చేసినా.. లక్ష్యాన్ని 37 ఓవర్లలోనే టీమ్ఇండియా ఛేధించింది.

అంతకుముందు శ్రీలంకను తక్కువ స్కోర్​కే పరిమితం చేయడంలో భారత బౌలర్లు విశేషమైన ప్రదర్శన చేశారు. కుల్దీప్​ యాదవ్​, యుజ్వేంద్ర చాహల్​ వంటి బౌలర్లు రాణించడం జట్టుకు శుభసూచకంగా చెప్పొచ్చు. మొత్తానికి రెండో వన్డే కోసం టీమ్ఇండియాలో కీలక మార్పులేవి జరగకపోవచ్చు.

మరింత దూకుడు అవసరం

శ్రీలంక జట్టులోని ఓపెనింగ్​ భాగస్వామ్యం బ్యాటింగ్​లో ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాత బరిలో దిగిన మిడిల్​ ఆర్డర్​ తేలిపోయింది. భారత బౌలర్ల ధాటికి అరకొర పరుగులు చేస్తూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. మ్యాచ్​ ఓడినా టీమ్ఇండియాకు తగ్గ పోటీని నెలకొల్పడంలో శ్రీలంక జట్టు విజయం సాధించింది.

ఓపెనర్​ అవిష్క ఫెర్నాండో(33), చరిత్​ అస్లంకా(38), కెప్టెన్​ శనకా(39), చమికా కరుణరత్నే(43) ఆకట్టుకునే ప్రదర్శన చేయడం వల్ల శ్రీలంక స్కోరు 250 పరుగులను అధిగమించింది. రెండో వన్డేలో లంక గెలుపొందాలంటే బౌలర్లు టీమ్ఇండియా బ్యాట్స్​మన్​పై ఒత్తిడి పెంచక తప్పదు. దీంతో పాటు బ్యాటింగ్​లోనూ మరింత దూకుడు పెంచాల్సిన అవసరం ఉంది.

తుదిజట్లు (అంచనా):

టీమ్ఇండియా: శిఖర్​ ధావన్​(కెప్టెన్​), పృథ్వీ షా, ఇషాన్​ కిషన్​(వికెట్​ కీపర్​), సూర్యకుమార్​ యాదవ్​, మనీష్​ పాండే, హార్దిక్​ పాండ్యా, కృనాల్ పాండ్యా, కుల్దీప్​ యాదవ్​, దీపక్​ చాహర్​, భువనేశ్వర్​ కుమార్​(వైస్​ కెప్టెన్​), యుజ్వేంద్ర చాహల్​.

శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్​ భానుకా(వికెట్​ కీపర్​), రాజపక్సా, ధనుంజయ డీ సెల్వా, చరిత్​ అస్లంకా, దుసన్​ శనకా(కెప్టెన్​) వానింద్​ హసరంగా, చమికా కరుణరత్నే, ఇసురు ఉడానా, దుష్మంత చమీరా, లక్ష్యన్​ సందకన్​.

ఇదీ చూడండి.. ప్రపంచకప్​ సూపర్ లీగ్​లో టీమ్​ఇండియా స్థానం ఇదే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.