India vs West Indies: కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమ్ఇండియా టాస్ గెలిచింది. వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
-
Captain @ImRo45 wins the toss and elects to bowl first in the 1st T20I.
— BCCI (@BCCI) February 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Live - https://t.co/dSGcIkX1sx #INDvWI @Paytm pic.twitter.com/MYahWGfY8R
">Captain @ImRo45 wins the toss and elects to bowl first in the 1st T20I.
— BCCI (@BCCI) February 16, 2022
Live - https://t.co/dSGcIkX1sx #INDvWI @Paytm pic.twitter.com/MYahWGfY8RCaptain @ImRo45 wins the toss and elects to bowl first in the 1st T20I.
— BCCI (@BCCI) February 16, 2022
Live - https://t.co/dSGcIkX1sx #INDvWI @Paytm pic.twitter.com/MYahWGfY8R
వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు.. టీ20 సిరీస్ కోసం సిద్ధమైంది. తొలి టీ20 కోల్‌కతా వేదికగా జరగుతుంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌ను అందుకు సన్నాహకంగా టీమ్ఇండియా భావిస్తోంది. మరోవైపు తమకు అచ్చొచ్చిన ఫార్మాట్‌లో భారత్‌కు గట్టిపోటీ ఇవ్వాలని కరీబియన్ జట్టు పట్టుదలతో ఉంది.
ఐదు రోజుల వ్యవధిలో 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్‌లో నాలుగు పిచ్‌లు సిద్ధం చేశారు.
భారత జట్టు: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, చాహల్
వెస్టిండీస్ జట్టు: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (కీపర్), రోవ్‌మన్ పావెల్, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, ఓడియన్ స్మిత్, ఫాబియన్ అలెన్, షెల్డన్ కాట్రెల్
ఇదీ చదవండి: ICC T20 Rankings: కోహ్లీ, రోహిత్ అదే స్థానాల్లో.. పంత్ పైపైకి!