ETV Bharat / sports

'స్పిన్​'కు చిక్కిన విండీస్​.. భారత్ లక్ష్యం 177 - వెస్ట్​ఇండీస్​

India vs West Indies: టీమ్​ఇండియా స్పిన్నర్లు చెలరేగారు. తొలి వన్డేలో విండీస్​ను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో టీమ్​ఇండియాకు కేవలం 177 పరుగుల లక్ష్యాన్నే నిర్దేశించారు కరీబియన్ బ్యాటర్లు. అహ్మదాబాద్​లోని​ మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్​ జరుగుతోంది.

India vs West Indies:
భారత్​-విండీస్​ మ్యాచ్
author img

By

Published : Feb 6, 2022, 4:47 PM IST

Updated : Feb 6, 2022, 5:56 PM IST

India vs West Indies: విండీస్​తో తొలి వన్డేలో భారత బౌలర్లు చెలరేగారు. మన స్పిన్​ మాయాజాలానికి చిక్కిన కరీబియన్లు.. 176 పరుగులకే ఆలౌట్​ అయ్యారు. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన విండీస్​ ఆరంభంలోనే చతికిలపడింది. ఓపెనర్లు హోప్​ 10 బంతుల్లో 8 పరుగులు, బ్రాండన్​ కింగ్​ 26 బంతుల్లో 13 పరుగులు చేసి పెవిలియన్​ బాట పట్టారు. ఆ తర్వాత వచ్చిన మిడిలార్డర్ బ్యాటర్లు కూడా భారత స్పిన్నర్లు సుందర్​, చాహల్​లు ధాటికి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో బ్రావో 18(34 బంతుల్లో) , బ్రూక్స్ 12(26)​, పూరన్​లు 18(25) కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యారు.

ఏడో స్థానంలో బ్యాటింగ్​కు దిగిన జేసన్​ హోల్డర్​(57 పరుగులు).. టెయిలెండర్​ అలెన్​(29)తో కలిసి గౌరవ ప్రదమైన స్కోరు అందించేందుకు కృషి చేశారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్​కు అజేయంగా 78 పరుగులు జోడించారు.

స్పిన్నర్లదే ఆధిపత్యం..

పిచ్​ స్పిన్​కు అనుకూలంగా ఉండటం వల్ల స్పిన్నర్లు చాహల్​, సుందర్​లు విజృంభించారు. చాహల్(49/4), సుందర్​(30/3) గణాంకాలు నమోదు చేశారు. పేసర్లు ప్రసిద్ధ్​ కృష్ణ 2, సిరాజ్ ఓ వికెట్ తీశారు.

వంద వన్డే వికెట్లు..

ఈ మ్యాచ్​ సందర్భంగా స్పిన్నర్​ చాహల్​ రికార్డు నెలకొల్పాడు. విండీస్​పై 3 వికెట్లు తీసిన ఈ స్పిన్నర్..​ 100 వన్డే వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు.

India vs West Indies
చాహల్​

గుజరాత్​ అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ వన్డే జరుగుతోంది. అంతర్జాతీయంగా టీమ్​ఇండియాకు ఇది 1000వ వన్డే కావడం విశేషం. ఈ మ్యాచ్​తోనే యువ క్రికెటర్​, ఆల్​రౌండర్​ దీపక్ హుడా.. భారత తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు.

ఇదీ చూడండి : BCCI Prize Money: కుర్రాళ్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

Last Updated : Feb 6, 2022, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.