ETV Bharat / sports

శతక్కొట్టిన విరాట్​ కోహ్లీ.. సచిన్​ను​ అధిగమించిన 'రన్​ మెషీన్​' - virat kohli centuries in odi

భారత్​-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమ్​ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. శ్రీలంకకు భారీ లక్ష్యం నిర్దేశించింది. శుభ్​మన్​ గిల్​ శతక్కొట్టి మెరిశాడు. విరాట్​ కోహ్లీ పలు రికార్డులను బద్దలుగొట్టి చరిత్ర సృష్టించాడు.

virat kohli fifth highest run getter in odi cricket

author img

By

Published : Jan 15, 2023, 7:17 PM IST

Updated : Jan 15, 2023, 10:02 PM IST

శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్​ విజృంభించింది. భారత బ్యాటర్లు చెలరేగి ఆడారు. విరాట్ గర్జిస్తూ​ వీర విహారం చేశాడు. 110 బంతుల్లో 166 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. శుభ్​మన్​ గిల్​ 116 పరుగులతో శతకొట్టాడు. కాగా, విరాట్​ కోహ్లీ ఈ మ్యాచ్​లో అద్భుత ప్రదర్శనతో పలు రికార్డులు బ్రేక్​ చేశాడు . మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందుల్కర్​నే అధిగమించి నయా చరిత్ర లిఖించాడు ఈ 'రన్​ మెషీన్'.

virat kohli fifth highest run getter in odi cricket
విరాట్​ కోహ్లీ

అత్యధిక పరుగుల వీరుడు..
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్​గా రికార్డు సృష్టించాడు. శ్రీలంక బ్యాటర్​ మహెల జయవర్ధనేను అధిగమించి ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు 268 వన్డేల్లో 57.78 సగటుతో 12,652 పరుగులు చేశాడు. అందులో 183 అత్యధిక స్కోర్​తో 45 సెంచరీలు, 65 అర్ధ సెంచరీలు పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆరో స్థానానికి పడిపోయిన జయవర్ధనే.. 448 మ్యాచ్​లు ఆడి 418 ఇన్నింగ్స్​లో 33.37 సగటుతో 12,650 పరుగులు చేశాడు. అందులో 19 సెంచరీలు, 77 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 144 పరుగులు చేశాడు.

మొదటి స్థానంలో ఉన్న మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్ తెందుల్కర్ 44.83 సగటుతో 18,426 పరుగులు చేశాడు. అందులో అత్యధిక స్కోర్​ 200లతో 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రెండో స్థానంలో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర 404 మ్యాచ్​లు ఆడి 14,234 పరుగులు చేశాడు. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్​ రికీ పాంటింగ్ 13,704 పరుగులు చేశాడు. శ్రీలంక ఆల్​ రౌండర్ సనత్​ జయసూర్య 13,430 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు.

సచిన్​ను అధిగమించిన కోహ్లీ..
విరాట్​ కోహ్లీ.. సచిన్​ తెందుల్కర్​ రికార్డులను బ్రేక్​ చేశాడు. సచిన్ 164 మ్యాచ్​ల్లో 20 సెంచరీలు చేశాడు. ఈ రికార్డును 105 మ్యాచ్​ల్లో 21 సెంచరీలు చేసి విరాట్​ కోహ్లీ అధిగమించాడు. ఇదే కాకుండా మరో రికార్డును కూడా కోహ్లీ బద్దలుగొట్టాడు. సచిన్​ ఆస్ట్రేలియాపై 9 సెంచరీలు చేశాడు. తాజాగా కోహ్లీ శ్రీలంకపై 10 సెంచరీలు బాది.. ఒకే టీమ్​పై అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్​గా చరిత్ర సృష్టించాడు.

Last Updated : Jan 15, 2023, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.