India Vs South Africa Test Series : సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ ఘోర ఓటమితో ప్రారంభించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియాపై సఫారీలు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉంది.
ఓవర్ నైట్ స్కోరు 256/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు 408 పరుగులకు ఆలౌటై 163 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఎలాగైనా గెలవాలన్న కసితో ఓపెనర్ డీన్ ఎల్గర్ (185) మైదానంలోకి దిగి పరుగుల వరద పారించాడు. మార్కో జాన్‌సేన్(84 నాటౌట్)తో కలిసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అయితే డబుల్ సెంచరీదిశగా దూసుకెళ్తున్న అతడ్ని శార్దూల్ ఠాకూర్ ఔట్ చేయడం వల్ల భారత జట్టు కాస్త ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత వచ్చిన గెరాల్డ్ కోఎట్జీ(18)ను కూడా అశ్విన్ పెవిలియన్ బాట పట్టించాడు. వెనువెంటనే వచ్చిన రబాడ(1), బర్గర్(0)లను బుమ్రా ఔట్ చేసి సఫారీల ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా సౌతాఫ్రికా పేసర్లు చెలరేగడం వల్ల 131 పరుగులకే ఓటమికి పాలైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ (76) ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక విరాట్‌తో పాటు శుభ్‌మన్ గిల్ (26) రెండకెల స్కోర్ చేశాడు. ఈ ఇద్దరు తప్ప మిగతా ఆటగాళ్లలందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రోహిత్ శర్మ(0), యశస్వి జైస్వాల్(5), శ్రేయస్ అయ్యర్(6), కేఎల్ రాహుల్(4), అశ్విన్(0), శార్దూల్ ఠాకూర్(2), జస్‌ప్రీత్ బుమ్రా(0), మహమ్మద్ సిరాజ్(4) ఇలా అందరూ తమ పేలవ ఫామ్‌తో దారుణంగా విఫలమయ్యారు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రీ బర్గర్ 4, మార్కో జాన్‌సెన్ 3, రబాడ 2 వికెట్లు తీశారు. ఇక టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే ఔటైంది. కేఎల్ రాహుల్ శతకం తప్ప మిగతా బ్యాటర్లు మంచి స్కోర్ సాధించలేకపోయారు.
అభిమానుల మనసులు గెలుచుకున్న రాహుల్! వీడియో చూశారా?
హిట్‌మ్యాన్‌పై మాజీలు ఫైర్- 'రోహిత్ శర్మ చేసిన పెద్ద తప్పు అదే'