ETV Bharat / sports

మొదటి టీ20లో కివీస్​ విజయం.. సూర్య, సుందర్ శ్రమ వృథా.. - ఇండియా న్యూజిలాండ్ మొదిటి టీ20 2023

న్యూజిలాండ్​తో జరిగిన మొదటి టీ20లో 21 పరుగుల తేడాతో టీమ్​ఇండియా ఓటమిపాలైంది. సూర్యకుమార్ యాదవ్​(47), వాషింగ్టన్​ సుందర్(50) రాణించినా ఫలితం లేకపోయింది.

india vs nz  1st T20I match result
india vs nz 1st T20I match result
author img

By

Published : Jan 27, 2023, 10:35 PM IST

Updated : Jan 27, 2023, 10:51 PM IST

న్యూజిలాండ్​తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్​లో 21 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమిపాలైంది. న్యూజిలాండ్​ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని భారత్​ ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసింది. సూర్యకుమార్ యాదవ్​(47), వాషింగ్టన్​ సుందర్(50) పరుగులతో రాణించినా ఫలితం లేకపోయింది. హార్దిక్​ పాండ్య(21), దీపక్ హుడా(10) ఫర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా పేలవ ప్రదర్శన చేశారు. కివీస్​ బౌలర్లలో బ్రేస్​వెల్(2), సాంటర్న్​(2) వికెట్లు తీశారు. డుఫ్ఫీ(1), సోధి(1), ఫెర్గుసన్(1) చెరొ వికెట్​ పడగొట్టారు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన కివీస్​ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మిచెల్​(59), కన్​వే(52), ఆలెన్(35) రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో సుందర్​ (2) వికెట్లు తీయగా.. అర్షదీప్​, కుల్దీప్ యాదవ్, శివమ్​ మావి ఒక్కో వికెట్​ చొప్పున పడగొట్టారు.

Last Updated : Jan 27, 2023, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.