ETV Bharat / sports

రెండో వన్డేలో టీమ్​ఇండియా సూపర్​ విక్టరీ.. సిరీస్​ కూడా మనదే.. - undefined

న్యూజిలాండ్​తో జరిగిన రెండో వన్డేలో టీమ్​ఇండియా ఘన విజయం సాధించింది. కివీస్​ నిర్దేశించిన స్పల్ప లక్ష్యాన్ని భారత్​.. రెండు వికెట్ల నష్టంతో 20.1 ఓవర్లలోనే ఛేదించింది.

india vs newzealand match india won
india vs newzealand match india won
author img

By

Published : Jan 21, 2023, 6:24 PM IST

Updated : Jan 21, 2023, 6:36 PM IST

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా అదరగొట్టింది. బంతితో ప్రత్యర్థిని చిత్తు చేసి, బ్యాట్‌తో రాణించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్‌ నిర్దేశించిన 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 20.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ (51) హాఫ్‌ సెంచరీతో అదరగొట్టగా.. గిల్‌ (40*) కూడా రాణించారు. కోహ్లీ (11), ఇషాన్‌ కిషన్‌ (8*) పరుగులు చేశారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో భారత్‌ సొంతం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే మంగళవారం జరగనుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌.. భారత బౌలర్ల ధాటికి 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (36) టాప్‌ స్కోరర్‌. మైఖేల్ బ్రాస్‌వెల్ (22), మిచెల్ శాంటర్న్‌ (27) పరుగులు చేశారు. టాప్‌ ఆర్డర్‌లో ఫిన్‌ అలెన్‌ (0), డెవాన్‌ కాన్వే (7), హెన్రీ నికోల్స్‌ (2), డారిల్ మిచెల్ (1), టామ్‌ లేథమ్‌ (1) విఫలమవడంతో కివీస్‌ 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. గ్లెన్‌ ఫిలిప్స్‌, బ్రాస్‌వెల్, శాంటర్న్‌ కాసేపు క్రీజులో నిలదొక్కుకోవడంతో కివీస్‌ 100 పరుగుల మార్కుని దాటింది. భారత బౌలర్లలో షమి 3, హార్దిక్ పాండ్య 2, వాషింగ్టన్‌ సుందర్‌ 2, సిరాజ్‌, శార్దూల్ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Last Updated : Jan 21, 2023, 6:36 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.