ETV Bharat / sports

IND vs NZ: భారత్​తో టీ20 సిరీస్​కు కివీస్​ స్టార్ పేసర్ దూరం - టీమ్​ఇండియా X న్యూజిలాండ్ టీ20 సిరీస్​

భారత్​తో టీ20 సిరీస్​ (IND vs NZ T20 series)నేపథ్యంలో న్యూజిలాండ్​ జట్టుకు మరో షాక్​ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ కైల్ జేమీసన్ టీ20 సిరీస్​కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు.

jamieson
జేమీసన్
author img

By

Published : Nov 17, 2021, 12:13 PM IST

Updated : Nov 17, 2021, 12:26 PM IST

భారత్​తో సిరీస్(IND vs NZ T20 series) నేపథ్యంలో న్యూజిలాండ్​ జట్టుకు మరో షాక్​ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు సారథి కేన్​ విలియమ్సన్​.. టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు ఆల్​రౌండర్ కైల్ జేమీసన్ కూడా అదే దారిలో వెళ్లాడు. టెస్టు సిరీస్​కు సన్నద్ధమవడం కోసం ఈ సిరీస్​కు దూరమవుతున్నట్లు తెలిపాడు. అయితే.. తమ ప్రణాళికలో భాగంగా జేమిసన్​ను టీ20 సిరీస్​కు దూరం చేసినట్లు కివీస్ హెడ్​ కోచ్ గ్యారీ స్టెడ్ వెల్లడించాడు.

"కేన్​ విలియమ్సన్, కైల్ జేమీసన్​తో మాట్లాడాకే టీ20 సిరీస్​లో వారికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. వారు టెస్టు సిరీస్​ మ్యాచ్​లకు సిద్ధమవుతున్నారు. టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న మరికొంత మంది యువ ఆటగాళ్లు కూడా టీ20 సిరీస్​కు దూరమయ్యే అవకాశముంది. వెంటవెంటనే పలు కీలక సిరీస్​ ఉండటం వల్ల ఇలా చేస్తున్నాం." అని గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు.

భారత్, కివీస్​ మధ్య టీ20 సిరీస్ నవంబర్ 17-21 మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ జైపూర్(నవంబర్ 17), రెండో మ్యాచ్ రాంచీ(నవంబర్ 19), మూడో మ్యాచ్ కోల్​కతా(నవంబర్ 21) వేదికగా జరగనున్నాయి. అనంతరం భారత్​తో టెస్టు మ్యాచ్​లు ఆడనుంది కివీస్. నవంబర్ 25-29 మధ్య కాన్పుర్​లో తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య ముంబయి వేదికగా రెండో టెస్టు జరగనుంది.

నేడు(నవంబర్ 17) జరగనున్న తొలి మ్యాచ్​లో కివీస్​ను ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది టీమ్​ఇండియా. టీ20 కెప్టెన్​ పగ్గాలు చేపట్టాక రోహిత్​కు ఇదే తొలి మ్యాచ్​ కాగా, హెడ్​ కోచ్​గా రాహుల్ ద్రవిడ్ తన ప్రస్థానాన్ని ఈ మ్యాచ్​తోనే ప్రారంభించనున్నాడు.

ఇదీ చదవండి:

Ind vs NZ: భారత్​-కివీస్​ టీ20 సిరీస్​- ఈ రికార్డులు బ్రేక్ అవుతాయా?

ind vs nz preview: భారత్-న్యూజిలాండ్ టీ20 సిరీస్.. గెట్ రెడీ

Last Updated : Nov 17, 2021, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.