ETV Bharat / sports

కివీస్​తో సిరీస్.. టీమ్​ఇండియాలోకి ఈ ఐపీఎల్​ స్టార్​లు! - హర్షల్​ పటేల్

టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) ​అనంతరం భారత్​లో పర్యటించనుంది న్యూజిలాండ్​ (India vs New Zealand). 3 టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటన కోసం ఐపీఎల్​లో అదరగొట్టిన పలువురు కుర్రాళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది!

India vs New Zealand
ఐపీఎల్
author img

By

Published : Nov 7, 2021, 3:49 PM IST

టీ20 ప్రపంచకప్​ (T20 World Cup 2021) పూర్తయిన వెంటనే టీమ్​ఇండియాకు బిజీ షెడ్యూల్​ ఉంది. నవంబర్​ 17 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్​తో 3 టీ20లు, రెండు టెస్టు​ల సిరీస్​ (India vs New Zealand) ఆడనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో, టీ20 ప్రపంచకప్​లో తమను ఓడించిన కివీస్​పై ప్రతీకారం తీర్చుకోవాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది. భారత జట్టుకు రాహుల్​ ద్రవిడ్​ కోచ్​గా వ్యవహరించనున్న తొలి సిరీస్​ ఇదే.

టీ20 ప్రపంచకప్​ తర్వాత అంతర్జాతీయ టీ20లకు సారథిగా తప్పుకోనున్నట్లు విరాట్ కోహ్లీ (Virat Kohli News) ఇదివరకే ప్రకటించాడు. ఇక సీనియర్లకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. "రోహిత్​పై (Rohit Sharma News) నిర్ణయం అతడితో చర్చించిన తర్వాతే ఉంటుంది. విశ్రాంతి తీసుకోవాలని భావించే స్వేచ్ఛ అతడికి ఉంది. అయితే టీమ్​ఇండియాను అతడు నడిపించాలని మేం కోరుకుంటున్నాం" అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.

ఈ కుర్రాళ్లకు పిలుపు..

వచ్చే సిరీస్​ కోసం జట్టును ప్రకటించే ముందు క్రికెటర్ల ప్రదర్శనను అంచనా వేయడానికి కొందరు సెలక్టర్లు ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారని సమాచారం. ఐపీఎల్​ 2021లో (IPL 2021 News) అదరగొట్టిన పలువురు క్రికెటర్లకు జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. వారిలో రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్, చేతన్ సకారియాలను న్యూజిలాండ్​తో సిరీస్​ (New Zealand Tour of India) కోసం పరిగణలోకి తీసుకోనున్నట్లు సమాచారం.

కోల్​కతా నైట్​రైడర్స్​కు ఆడిన వెంకటేశ్ అయ్యర్​.. రెండో దశ ఐపీఎల్​లో అద్భుతంగా ఆడాడు. 10 మ్యాచుల్లో 41.11 సగటుతో 370 పరుగులు చేశాడు. ఐపీఎల్​ 2021 విన్నర్​ రుతురాజ్​ గైక్వాడ్​.. ఈ ఏడాది చెన్నై సూపర్​ కింగ్స్​ ఛాంపియన్​గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. 635 పరుగులతో ఆరెంజ్​ క్యాప్​ సొంతం చేసుకున్నారు. అవేశ్​ ఖాన్, చేతన్ సకారియా కూడా ఈ ఐపీఎల్​లో ఆకట్టుకున్నారు. హర్షల్​ పటేల్ 32 వికెట్లు పడగొట్టి పర్పుల్​ క్యాప్​ దక్కించుకున్నాడు.

ఇదీ చూడండి: టీమ్​ఇండియా టీ20 కెప్టెన్​గా ఆ పేసర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.