ETV Bharat / sports

India vs Nepal Asia Cup 2023 : పసికూనతో మ్యాచ్​కు అంతా రెడీ.. టీమ్ఇండియా టార్గెట్ అదే.. - ఆసియా కప్ 2023 భారత్ నేపాల్ మ్యాచ్ వాతావరణం

India vs Nepal Asia Cup 2023 : 2023 ఆసియా కప్​లో సోమవారం భారత్.. పసికూన నేపాల్​తో తలపడనుంది. ఈ మ్యాచ్​తో మినీటోర్నీలో బోణీ కొట్టాలని ఇరు జట్లు ఆశిస్తున్నాయి.

India vs Nepal Asia Cup 2023
India vs Nepal Asia Cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 6:51 AM IST

Updated : Sep 4, 2023, 8:06 AM IST

India vs Nepal Asia Cup 2023 : 2023 ఆసియా కప్​లో భాగంగా భారత్ రెండో మ్యాచ్​కు అంతా సిద్ధమైంది. పల్లెకెలె వేదికగా సోమవారం భారత్​.. నేపాల్​తో తలపడనుంది. అయితే తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్.. బ్యాటింగ్ వైఫల్యాలను సరిదిద్దుకొని మినీటోర్నీలో ఈ మ్యాచ్​తోనైనా బోణీ కొట్టి, సూపర్ 4 కు అర్హత సాధించాలని భావిస్తోంది.

తొలి మ్యాచ్​లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమ్ఇండియా టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. పాకిస్థాన్ పేసర్ల పదునైన బంతులను ఎదుర్కోలేక.. వికెట్లు పారెసుకుంది. ఈ మ్యాచ్​లోనైనా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్​తో కమ్​బ్యాక్ ఇవ్వాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

వారికి అద్భుతమైన ఛాన్స్..
యువ సంచలనం శుభ్​మన్​ గిల్ వన్డేల్లో లయ తప్పినట్లు కనిపిస్తున్నాడు. విండీస్ పర్యటనలో కూడా మూడింట్లో ఒకే మ్యాచ్​లో రాణించి.. రెండింట్లో ఫెయిలయ్యాడు. ఇప్పుడు మినీ టోర్నమెంట్​ పాక్​తో మ్యాచ్​లో గిల్.. చాలా ఇబ్బంది పడ్డట్లు కనిపించాడు. తేమగా ఉన్న పిచ్​పై పరుగులు చేసేందుకు బాగా కష్టపడ్డాడు. ఇక పసికూన నేపాల్​పై అయినా చెలరేగి.. తన సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సుమారు ఆరు నెలల తర్వాత జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్. ఎన్నోఅంచనాలతో తొలి మ్యాచ్​లో క్రీజులోకి వచ్చిన అయ్యర్ త్వరగానే పెవిలియన్ చేరాడు. సోమవారం నాటి మ్యాచ్​లోనైనా అయ్యర్.. నేపాల్​పై రాణించి ఫామ్​ను అందుకునేందుకు అతడికి సూపర్ ఛాన్స్​ ఉంది.

బౌలర్లు ఏం చేస్తారో.. భారీ వర్షం కారణంగా మొదటి మ్యాచ్​లో భారత్​కు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల పేసర్ జస్​ప్రీత్ బుమ్రా.. భారత్​కు తిరుగు పయణమయ్యాడు. ఇప్పుడు బుమ్రా స్థానంలో మహమ్మద్ షమి జట్టులోకి రానున్నాడు. మరి పసికూన నేపాల్​ను భారత బౌలర్లు ఎలా కట్టడి చేస్తారో చూడాలి.

మళ్లీ వర్షం ముప్పు.. భారత్ రెండో మ్యాచ్ కూడా పల్లెకెలె మైదానంలోనే ఆడనుంది. పల్లెకెలెలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం.. సోమవారం నాటి మ్యాచ్​కూ అంతరాయం కలిగించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ మళ్లీ రద్దైతే.. వర్షం కారణంగా ఈ మ్యాచ్​ కూడా రద్దైతే.. ఇరుజట్లు చెరో పాయింట్ పంచుకుంటాయి. దీంతో భారత్​కు పెద్ద నష్టమేమీ ఉండదు. ఎందుకంటే రెండు పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంటుంది. ఒక పాయింట్​తో నేపాల్ ఇంటిబాట పడుతుంది. దీంతో భారత్ నేరుగా సూపర్ 4 కు అర్హత సాధిస్తుంది.

Ind vs Pak Asia Cup 2023 : డోంట్​ వర్రీ ఫ్యాన్స్​.. టోర్నీలో మరో ఇండో-పాక్ మ్యాచ్​.. డేట్ ఫిక్స్​!

World Cup 2023 India Squad : ప్రపంచకప్​నకు భారత్​ జట్టు రెడీ!.. రాహుల్ ఇన్​.. శాంసన్ ఔట్?

Last Updated : Sep 4, 2023, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.