ETV Bharat / sports

Rishabh Pant: పంత్​ను వెనకేసుకొచ్చిన దాదా - ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్

టీమ్​ఇండియా యువ క్రికెటర్​ రిషభ్ పంత్​కు మద్దతుగా నిలిచాడు మాజీ సారథి సౌరవ్ గంగూలీ. అన్ని సమయాల్లో మాస్కు ధరించడం సాధ్యపడదని అన్నాడు.

Sourav Ganguly
రిషభ్​ పంత్​
author img

By

Published : Jul 16, 2021, 10:45 AM IST

ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​కు ముందు కరోనా బారినపడి విమర్శలు ఎదుర్కొంటున్న టీమ్​ఇండియా క్రికెటర్​ రిషభ్​ పంత్​ను వెనకేసుకొచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. అన్ని వేళలా మాస్కు ధరించడం భౌతికంగా సాధ్యపడదని అన్నాడు.

"ఇంగ్లాండ్​లో యూరో ఛాంపియన్​షిప్, వింబుల్డన్​ చూశాం. నిబంధనలు మారాయి. ప్రేక్షకులను మైదానంలోకి అనుమతిస్తున్నారు. పైగా క్రికెటర్లు సెలవులపై ఉన్నారు. అన్ని సమయాల్లో మాస్కు ధరించడం అనేది సాధ్యం కాదు."

-సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

న్యూజిలాండ్​తో డబ్ల్యూటీసీ ఫైనల్​ అనంతరం 20 రోజుల విరామంలో ఉంది కోహ్లీ సేన. ఈ క్రమంలోనే యూరో కప్​ చూడటానికి వెళ్లిన పంత్​కు కరోనా సోకింది. మాస్కు ధరించకుండా నిర్లక్ష్యంగా ఉన్నందు వల్లే అతడు వైరస్​ బారిన పడ్డాడని నెటిజన్లు విపరీతంగా ట్రోల్​ చేశారు. ఈ నేపథ్యంలోనే పంత్​కు మద్దతుగా నిలిచాడు దాదా.

ఐసోలేషన్​లోనే..

ఆగస్టు 4న ఇంగ్లాండ్​తో 5 మ్యాచ్​ల టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. దాని​ కోసం టీమ్​ఇండియాతో పాటు పంత్​ గురువారం.. దుర్హమ్​ వెళ్లబోడని సమాచారం. ప్రస్తుతం అతడికి ఎలాంటి లక్షణాలు లేవని, లండన్​లోనే ఐసోలేషన్​లో ఉంటాడని తెలుస్తోంది. జులై 8న పంత్​కు పాజిటివ్​గా నిర్ధరణ కాగా, త్వరలోనే క్వారంటైన్ ముగియనుంది.

వీరు కూడా..

మరోవైపు సహాయక సిబ్బంది దయానంద్​ గారానీ కూడా జులై 14న కరోనా బారినపడ్డారు. దీంతో అతడితో సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ అరుణ్, వికెట్ కీపర్ సాహా, అభిమన్యు ఈశ్వరన్​లు లండన్​లోనే 10 రోజుల పాటు ఐసోలేషన్​లో ఉంటారు.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​కు అశ్విన్​ హెచ్చరికలు.. ఒకే ఇన్నింగ్స్​లో ఆరు వికెట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.