ETV Bharat / sports

ఔటైనా క్రీజు వదలని కోహ్లీ.. అంపైర్లు, బంగ్లా కెప్టెన్​ జోక్యం.. వీడియో వైరల్

author img

By

Published : Dec 24, 2022, 8:31 PM IST

టీమ్ఇండియా- బంగ్లా రెండో టెస్టులో విరాట్ కోహ్లీ రెండు సార్లు సహనం కోల్పోయాడు. ఔట్​ అయినా గ్రౌండ్​ నుంచి బయటకు వెళ్లకుండా.. బంగ్లా ప్లేయర్​తో వాగ్వాదానికి దిగాడు. దీంతో బంగ్లా కెప్టెన్​తో పాటు అంపైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఏమైందంటే..

india vs bangladesh virat kohli
india vs bangladesh virat kohli

బంగ్లాదేశ్​తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. రెండో టెస్టు మూడో రోజులో టీమ్​ఇండియా ప్లేయర్​ విరాట్​ కోహ్లీ సహనం కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. భారత్​ రెండో ఇన్నింగ్స్​లో విరాట్​ ఔట్​ అయ్యాక గ్రౌండ్​ నుంచి బయటకు వెళ్లలేదు. కాగా, విరాట్ ఔటయ్యాక బంగ్లా ప్లేయర్ల సంబరాలు చేసుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన విరాట్​.. తైజుల్ ఇస్లామ్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. దీంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్, అంపైర్లు జోక్యం చేసుకున్నారు. అయినా కోహ్లీ మాత్రం శాంతించలేదు. వాడు చాలా ఎక్స్‌ట్రాలు చేస్తున్నాడని షకీబ్‌కు సూచిస్తూ.. క్రీజును వీడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

india vs bangladesh virat kohli
విరాట్​ కోహ్లీ
india vs bangladesh virat kohli
విరాట్​ కోహ్లీ

బంగ్లా రెండో ఇన్నింగ్స్​లో కూడా కోహ్లీ సహనం కోల్పోయాడు. ఓపెనర్​ షాంటోపై.. 'దూస్తులు కూడా విప్పేయ్'​ అంటూ ఫైర్​ అయ్యాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
కాగా, కోహ్లీ కోపానికి దారితీసిన కారణలేంటో తెలియాల్సింది. కోహ్లీ ఆగ్రహించిన తర్వాత.. బంగ్లా కెప్టెన్​ షకీబ్ అల్​ హసన్​ తైజుల్​ను మందలించినట్లు తెలుస్తోంది. అయితే తైజుల్​ ఏమైనా నోటికి పనిచెప్పాడు లేదా మరే ఇతర కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. కాగా, మూడోరోజు ఆట ముగిసే సమయానికి విజయానికి 100 పరుగుల దూరంలో టీమ్ఇండియా నిలిచింది.

@imVkohli ViratKohli aggression on Bangladesh players😈🥵. #ViratKohli #INDvsBAN pic.twitter.com/VKwFSGHPNl

— Conor McGregor 🇮🇪 (@VemulapatiVish1) December 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బంగ్లాదేశ్​తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. రెండో టెస్టు మూడో రోజులో టీమ్​ఇండియా ప్లేయర్​ విరాట్​ కోహ్లీ సహనం కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. భారత్​ రెండో ఇన్నింగ్స్​లో విరాట్​ ఔట్​ అయ్యాక గ్రౌండ్​ నుంచి బయటకు వెళ్లలేదు. కాగా, విరాట్ ఔటయ్యాక బంగ్లా ప్లేయర్ల సంబరాలు చేసుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన విరాట్​.. తైజుల్ ఇస్లామ్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. దీంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్, అంపైర్లు జోక్యం చేసుకున్నారు. అయినా కోహ్లీ మాత్రం శాంతించలేదు. వాడు చాలా ఎక్స్‌ట్రాలు చేస్తున్నాడని షకీబ్‌కు సూచిస్తూ.. క్రీజును వీడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

india vs bangladesh virat kohli
విరాట్​ కోహ్లీ
india vs bangladesh virat kohli
విరాట్​ కోహ్లీ

బంగ్లా రెండో ఇన్నింగ్స్​లో కూడా కోహ్లీ సహనం కోల్పోయాడు. ఓపెనర్​ షాంటోపై.. 'దూస్తులు కూడా విప్పేయ్'​ అంటూ ఫైర్​ అయ్యాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
కాగా, కోహ్లీ కోపానికి దారితీసిన కారణలేంటో తెలియాల్సింది. కోహ్లీ ఆగ్రహించిన తర్వాత.. బంగ్లా కెప్టెన్​ షకీబ్ అల్​ హసన్​ తైజుల్​ను మందలించినట్లు తెలుస్తోంది. అయితే తైజుల్​ ఏమైనా నోటికి పనిచెప్పాడు లేదా మరే ఇతర కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. కాగా, మూడోరోజు ఆట ముగిసే సమయానికి విజయానికి 100 పరుగుల దూరంలో టీమ్ఇండియా నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.