ETV Bharat / sports

ఆసీస్​తో మూడో టెస్ట్.. టాస్​ గెలిచిన భారత్​.. రాహుల్​ ఔట్

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్​కు రంగం సిద్ధమైంది. టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్​ ఎంచుకుంది. ఆస్ట్రేలియాను బౌలింగ్​కు ఆహ్వానించింది.

india vs australia third test india elected to bat

author img

By

Published : Mar 1, 2023, 9:10 AM IST

Updated : Mar 1, 2023, 9:25 AM IST

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్​కు రంగం సిద్ధమైంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను వరుసగా రెండు టెస్టుల్లోనూ చిత్తు చేసిన భారత్‌.. సిరీస్‌ విజయమే లక్ష్యంగా మూడో టెస్టులో బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. సిరీస్‌లో మరో మ్యాచ్‌ ఉన్నప్పటికీ.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తు విషయంలో ఉత్కంఠకు అవకాశం లేకుండా ఇందౌర్‌లోనే గెలిచి సిరీస్‌ విజయంతో పాటు ఆ బెర్తునూ సొంతం చేసుకోవాలని రోహిత్‌ సేన చూస్తోంది.

  • భారత్​ తుది జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్​, పుజారా, విరాట్​ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్​, రవీంద్ర జడేజా, శ్రీకర్​ భరత్‌, అశ్విన్‌, అక్షర్‌, ఉమేశ్‌, సిరాజ్‌.
  • ఆస్ట్రేలియా తుది జట్టు: ట్రావిస్​ హెడ్‌, ఉస్మాన్​ ఖవాజా, లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), హాండ్స్‌కాంబ్‌, గ్రీన్‌, కేరీ, స్టార్క్‌, మర్ఫీ, లైయన్‌, కునెమన్‌.

పిచ్‌.. కొంచెం తేడా
మూడో టెస్టుకు ఆతిథ్యమివ్వనున్న హోల్కర్‌ స్టేడియం కూడా స్పిన్‌కే అనుకూలం. కానీ తొలి రెండు టెస్టులతో పోలిస్తే ఇక్కడ కొంచెం పేసర్లకు అవకాశముంటుంది. ఇక్కడ జరిగిన గత రెండు టెస్టుల్లో తొలి రెండు రోజులు పేసర్లు ప్రభావం చూపారు. స్పిన్నర్లు రెండో రోజు నుంచి ఆధిపత్యం చలాయించవచ్చు. మ్యాచ్‌ ముందు రోజు పిచ్‌పై కొంచెం పచ్చిక కనిపించింది. బుధవారం కూడా పిచ్‌ అలాగే ఉంటే పేసర్లకు అవకాశం ఉన్నట్లే.

"రెండో టెస్టు పూర్తయినపుడే నేనో మాట చెప్పా.. సమర్థులైన ఆటగాళ్లు పేలవ దశలో ఉన్నపుడు పుంజుకోవడానికి చాలినంత సమయం ఇస్తామని. రాహుల్‌ ఇంతకుముందు వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు అతడిని ఆ బాధ్యతల నుంచి తప్పించినంత మాత్రానే ఏదో సంకేతం ఇస్తున్నట్లు కాదు. గిల్‌, రాహుల్‌ల విషయానికి వస్తే.. ప్రతి మ్యాచ్‌ ముంగిట అందరూ సాధన చేసేటట్లే చేశారు. తుది జట్టులో ఉండే 11 మంది ఆటగాళ్లెవరో టాస్‌ సమయంలో వెల్లడిస్తాం. ఎందుకంటే చివరి నిమిషాల్లో గాయపడే వాళ్లు కూడా ఉంటారు. ఇండోర్‌లో మేం విజయం సాధిస్తే.. అహ్మదాబాద్‌లో జరిగే చివరి టెస్టులో భిన్నమైన ప్రణాళికతో బరిలోకి దిగుతాం. ఎందుకంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరిగే ఇంగ్లాండ్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం భిన్నంగా ఉంటుంది" -రోహిత్‌ శర్మ

"ఈ సిరీస్‌లో మా ప్రణాళికలు అనుకున్నట్లుగా సాగలేదు. మేం కొన్ని సందర్భాల్లో మంచి స్థితిలో ఉన్నా ఉపయోగించుకోలేకపోయాం. ఈ వారం ఆ తప్పులను సరి చేసుకోవాలనుకుంటున్నాం. ప్రత్యర్థి స్పిన్నర్లపై ఒత్తిడి తెచ్చి పెద్ద స్కోర్లు సాధిస్తామని ఆశిస్తున్నాం"- స్టీవ్‌ స్మిత్‌

Last Updated : Mar 1, 2023, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.