బోర్డర్-గావర్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు జరుగుతోంది. రెండు రోజు భారత్ ఇన్నింగ్స్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. అంపైర్‌పై నెటిజన్లు మండి పడుతున్నారు. అంపైర్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే..
టీమ్ఇండియా ఓవర్ నైట్ స్కోర్ 21/0తో రెండో రోజు ఆటను మొదలు పెట్టింది. 50వ ఓవర్లో మాత్యూ బౌలింగ్‌లో కోహ్లీ క్రీజులో ఉన్నాడు. మాత్యూ మూడో బంతిని విరాట్ డిఫెండ్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ బంతి విరాట్ బ్యాట్‌కు అతి దగ్గరగా వెళ్లి.. ప్యాడ్‌ను తాకింది. వెంటనే మాత్యూ ఔట్‌కు అప్పీల్ చేశాడు. దీంతో అంపైర్ నితిన్ మీనన్ కోహ్లీ ఔట్ అయినట్లు ప్రకటించాడు. అంపైర్ నిర్ణయాన్ని కాదని వెంటనే విరాట్ కోహ్లీ రివ్యూ కోరాడు. దీంతో అంపైర్ పరిశీలించి.. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ) ఇచ్చాడు. దీనిపై కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. కాగా, ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ 84 బంతుల్లో 44 పరుగులు చేశాడు.
అది నాటౌట్..!
అయితే కోహ్లీని థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడంపై వివాదం చెలరేగింది. దీంతో భారత జట్టు మాజీ క్రికెటర్లు అభినవ్ ముకుంద్, వసీం జాఫర్ కూడా స్పందించారు. "అది నాటౌట్. బంతి ప్యాడ్ కన్నా ముందు బ్యాట్‌కు తాకింది. థర్డ్ అంపైర్ నిర్ణయంలో చాలా సందేహాలున్నాయి" అంటూ జాఫర్ ట్వీట్ చేశాడు. వీరితో పాటు సోషల్‌మీడియా వేదికగా దీన్ని ఖండిస్తున్నారు నెటిజన్లు. 'అంపైర్లు ఎప్పుడూ విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేయరు' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. కోహ్లీ సెటిల్ అయి.. సెంచరీ బాదే సమయానికే ఇలా జరిగిందంటూ కొందరు అభిమానులు నిరాశపడుతున్నారు. 'నితిన్ మీనన్ కరెక్ట్ నిర్ణయాల కన్నా.. తప్పుడు నిర్ణయాలే ఎక్కువ తీసుకుంటాడు. అతడిని అరెస్టు చేయండి' అని అంపైర్ నితిన్ మీనన్‌పై విరుచుకుపడుతున్నారు. నాట్ఔట్ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో లయోన్ నాథన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఐదు వికెట్లు బడగొట్టి భారత భారత బ్యాటర్లకు సవాల్ విసిరాడు. దీంతో టీమ్ఇండియాపై 100 వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.