ETV Bharat / sports

క్లీన్​ స్వీప్​ దిశగా రోహిత్ సేన - మూడో టీ20 కోసం జట్టులో ఆ మూడు మార్పులు! - ఇండియా vs అఫ్గానిస్థాన్​ సిరీస్

India Vs Afghanistan 3rd T20 : సొంతగడ్డపై అఫ్గానిస్థాన్​తో జరుగుతున్న టీ20 సిరీస్​లో టీమ్ఇండియా దుమ్ములేపుతోంది. ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తూ రెండో టీ20లో గెలుపొందిన భారత జట్టు ఇప్పుడు ఆఖరి టీ20లోనూ ఆధిక్యాన్ని సాధించాలనుకుంటోంది. బుధవారం జరగనున్న మూడో టీ20లోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలన్న కసితో కసరత్తులు చేస్తోంది.

India Vs Afghanistan 3rd T20
India Vs Afghanistan 3rd T20
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 6:44 AM IST

India Vs Afghanistan 3rd T20 : కుర్రాళ్ల జోరు వల్ల ఇప్పటికే 2-0తో సిరీస్‌ గెలుచుకున్న భారత జట్టు ఇప్పుడు బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లోనూ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ తేలిపోయిన అఫ్గాన్‌ జట్టు ఈ సారి ఏ మేరకు నిలుస్తుందో చూడాలి.

అయితే టీ20 ప్రపంచకప్‌ ముందు దూకుడుగా ఆడుతూ టీమ్‌ఇండియా ముందుకు సాగుతోంది. తొలి మ్యాచ్‌లో 17.3 ఓవర్లకు 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే, ఆ తర్వాతి మ్యాచ్‌లో 15.4 ఓవర్లకే 173 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. ఆరంభంలో వికెట్లు పడినప్పటికీ ధాటిగా ఆడాలన్న లక్ష్యంతోనే ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాటర్లు కనిపించారు. యంగ్​ సెన్సేషన్ శివమ్‌ దూబె వరుస మ్యాచ్‌ల్లోనూ తన మెరుపు ఫామ్​తో అర్ధశతకాలు బాదగా, రెండో టీ20లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, విరాట్ కోహ్లి సత్తాచాటారు. సూమారు 14 నెలల బ్రేక్​ తర్వాత టీ20 మ్యాచ్‌ ఆడిన కోహ్లి ఈ మ్యాచ్​లో 181 స్ట్రైక్‌రేట్‌తో 16 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. స్పిన్‌లో కాస్త నెమ్మదిగా ఆడే విరాట్​ ముజీబ్‌ బౌలింగ్‌లో ఎదుర్కొన్న 7 బంతుల్లో 18 పరుగులు చేసి ఔరా అనిపించాడు.

అయితే ఇప్పుడు అందరి దృష్టి కెప్టెన్ రోహిత్ శర్మపై ఉంది. అతడు పరుగులు అందుకోవాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌటైన రోహిత్, మూడో టీ20లో సత్తాచాటాలని అటు భారత జట్టుతో పాటు ఇటు హిట్​మ్యాన్​ ఫ్యాన్స్​ కోరుకుంటున్నారు. మరోవైపు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ బాదడమే లక్ష్యంగా పెట్టుకుని ఈ సిరీస్‌ ఆడుతున్న టీమ్‌ఇండియా రానున్న మ్యాచ్​లోనూ అదే ప్లాన్​ను ఉపయోగించేందుకు మరోసారి బరిలోకి దిగనుంది.

ఇప్పటికే సిరీస్‌ గెలిచినప్పటికీ, రోహిత్ సేన ఈ సారి ఎక్కువగా ప్రయోగాలు చేయకపోవచ్చు. బ్యాటింగ్‌లోనూ ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. వికెట్‌కీపర్‌గా సంజు శాంసన్‌కు అవకాశమిస్తారా లేదా అన్నది చూడాలి. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో నాలుగో టీ20లో అవకాశం దక్కించుకున్న జితేశ్‌ శర్మ వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. దీంతో అతడి బదులు శాంసన్‌కు ఛాన్స్‌ దక్కొచ్చు. బౌలింగ్‌లో అయితే రవి బిష్ణోయ్‌ లేదా వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో కుల్‌దీప్‌ యాదవ్‌ను ఆడించే అవకాశాలున్నాయి. ఇక ముకేశ్‌ కుమార్‌ స్థానంలో అవేశ్​ ఖాన్‌ తుది జట్టులోకి రావొచ్చు.

ఇక రషీద్‌ ఖాన్‌ లేక బలహీనంగా మారిన అఫ్గాన్‌ జట్టు ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌పై కొండంత ఆశలు పెట్టుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ అతడు పెద్దగా రాణించలేదు. సిరీస్‌లో అఫ్గాన్‌ జట్టులో ఒకరిద్దరు ఆటగాళ్లు రాణించినప్పటికీ సమష్టిగా ఆ జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇవ్వడంలో ఘోరంగా విఫలమైంది. మరి ఆఖరి ఈ మ్యాచ్‌లోనైనా అఫ్గాన్‌ ఆట మారుతుందేమో లేదో వేచి చూడాలి మరి.

తుది జట్లు(అంచనా):
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, కోహ్లి, అర్ష్‌దీప్‌ సింగ్‌, శివమ్‌ దూబె, జితేశ్‌ శర్మ, రింకు సింగ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌/కుల్‌దీప్‌ యాదవ్‌, రవి బిష్ణోయ్‌, ముకేశ్‌ కుమార్‌/అవేష్‌ ఖాన్‌

అఫ్గానిస్థాన్‌ : రహ్మానుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, గుల్బదీన్‌ నైబ్‌, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, మహ్మద్‌ నబి, నజీబుల్లా జద్రాన్‌, కరీమ్‌ జనత్‌, నూర్‌ అహ్మద్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, ఫజల్‌హక్‌ ఫరూఖీ

పిచ్ ఎలా ఉందంటే ?
India Vs Afghanistan 3rd T20 Pitch Report : చిన్న బౌండరీలు కలిగిన చిన్నస్వామి స్టేడియం పరుగులకు పెట్టింది పేరు. కానీ అందుకు భిన్నంగా జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఇక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో టీమ్ఇండియా 160 పరుగులను కాపాడుకుంది. వరల్డ్​కప్​లో అయిదు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన బెంగళూరులో ఉన్న ఈ కొత్త పిచ్‌పై మ్యాచ్‌ జరగనుంది. దీంతో ఎప్పటిలా పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అందుకే గిల్​పై ఫైర్ అయ్యాను : రోహిత్ శర్మ

'అటువంటి అనవసర విషయాలను ఆలోచించను - అలానే ఉండాలనుకుంటున్నాను'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.